ఆమ్ ఆద్మీ పార్టీ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు
దేశ రాజధాని ఢిల్లీతో పాటు పంజాబ్‌లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతోంది.
దేశ రాజధాని ఢిల్లీతో పాటు పంజాబ్‌లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతోంది.
దేశంలోని జాతీయ పార్టీల్లో చేరిన సరికొత్త పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్). అరవింద్ కేజ్రీవాల్ తన సహచరులతో కలిసి 26 నవంబర్ 2012న ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు.
AAP ప్రస్తుతం 2 రాష్ట్రాల్లో (పంజాబ్‌తో పాటు కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీ) అధికారంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 2013 నుంచి ఢిల్లీలో నిరాటంకంగా అధికారంలో కొనసాగుతుండగా.. 2022లో పంజాబ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఢిల్లీలో కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండగా.. పంజాబ్‌లో భగవంత్ మాన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
పంజాబ్‌లో ఘనవిజయం తర్వాత గత ఏడాది ఏప్రిల్ 10న ఆప్‌కి కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా జాతీయ పార్టీ హోదాను కల్పించింది. ఆ పార్టీ ఎన్నికల గుర్తు చీపురు. 2019 లోక్‌సభ ఎన్నికలలో ఆప్ ఏకైక లోక్‌సభ స్థానాన్ని (సంగ్రూర్ పార్లమెంటరీ స్థానం) గెలుచుకుంది.
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆప్ పార్టీ ఇండియా కూటమిలో చేరింది. ఇందులో భాగంగా ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. అయితే పంజాబ్‌లో కాంగ్రెస్‌తో ఆప్‌కు ఎన్నికల పొత్తు కుదరలేదు. దీంతో అక్కడ ఆ రెండు పార్టీలు విడివిడిగా పోటీచేస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో ఆప్ పొత్తు కుదుర్చుకుంది.
Party Name | Party Logo | Party President | Party Establishment Year |
---|---|---|---|
Bharatiya Janata Party | JP Nadda | April 1980 | |
Indian National Congress | Mallikarjun Kharge | December 1885 | |
Aam Aadmi Party | Arvind Kejriwal | November 2012 | |
Bahujan Samaj Party | Mayawati | April 1984 | |
Communist Party of India (Marxist-Leninist) | Sitaram Yechury | November 1964 | |
All India Majlis-E-Ittehadul Muslimeen | Asaduddin Owaisi | November 1927 | |
Bharat Rashtra Samithi | K. Chandrashekar Rao | April 2001 | |
Telugu Desam | N. Chandrababu Naidu | March 1982 | |
Yuvajana Sramika Rythu Congress Party | YS Jagan Mohan Reddy | March 2011 |