TSRTC: ప్రయాణికులు మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన టీఎస్‌ఆర్టీసీ.. స్కాన్ చేయండి.. జర్నీ చేయండి.!

|

Sep 05, 2022 | 8:43 AM

ప్రస్తుత కాలం అంతా టెక్నాలజీ మయమైపోయింది. పే యాప్స్ ద్వారా లావాదేవీలు పెరిగిపోతున్నాయి. నగదు వినియోగం తగ్గిపోయి డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు.


ప్రస్తుత కాలం అంతా టెక్నాలజీ మయమైపోయింది. పే యాప్స్ ద్వారా లావాదేవీలు పెరిగిపోతున్నాయి. నగదు వినియోగం తగ్గిపోయి డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా లిక్విడ్ క్యాష్ లావాదేవీలు అంతగా జరగడం లేదు. కొన్ని సార్లు మనం అప్పటికప్పుడే ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆ సమయంలో దగ్గర నగదు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటాం. వీరి బాధలనున గుర్తించిన టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్, డెబిట్‌ కార్డులతో క్యూఆర్‌ కోడ్‌తో యూపీఐ పేమెంట్స్‌‌తో దర్జాగా ప్రయాణం చేయవచ్చు. తాజాగా కరీంనగర్‌ రీజియన్ లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. టికెట్లు ఇచ్చే విధానాన్ని సులభంగా మార్చేందుకు ఆర్టీసీ ఇప్పటికే టిమ్స్ ను ప్రవేశపెట్టింది. వాటి ద్వారానే డిజిటల్ పేమెంట్స్ జరపాలని నిర్ణయించింది. డెబిట్, క్రెడిట్‌ కార్డులతో స్వైపింగ్, క్యూఆర్‌ కోడ్‌తో టికెట్లు కొనుగోలు చేసే సదుపాయం కల్పించింది. ఈ విధానం గ్రేటర్‌ హైదరాబాద్‌లో అమలవుతుండగా తాజాగా కరీంనగర్‌ రీజియన్‌లో ప్రయోగత్మకంగా ప్రారంభించారు. కరీంనగర్‌ రీజియన్‌లోని రాజధాని, హైటెక్, సూపర్‌లగ్జరీ, గరుడ, గరుడ ప్లస్ వంటి దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సు సర్వీసుల్లో క్యాష్‌లెస్‌ సేవలు అందించేందుకు అవసరమైన పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం కొన్ని బస్సు సర్వీసుల్లోనే ఈ విధానం అమలవుతుండగా త్వరలోనే దశల వారీగా అన్ని బస్సుల్లో అమలు చేస్తామని అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Bride Running on Road: నీ తల్లీ అంటూ మరోసారి తెలంగాణ శకుంతలను గుర్తు చేసిన మహిళా.. నన్ను పెళ్లి చేసుకుంటావా..లేదా..!

Mother sentiment: పసితనంలో తల్లిని పోగొట్టుకొని.. ఆమె తల్లి సమాధి వద్ద ఈ పిల్లాడు చేసిన పనికి మీకు కూడా కనీళ్లు ఆగవు..

Published on: Sep 05, 2022 08:43 AM