త‌గ్గేదే లే అంటున్న తాత‌ !! క్రికెట్‌ ఆడుతూ పరుగుల వరద సృష్టిస్తూ.. వీడియో

|

Feb 16, 2022 | 11:40 AM

ఒక వ‌య‌సు దాటాక చాలామంది పెద్దవాళ్లు ఇక తమ పని అయిపోయిందనుకుంటూ పూర్తిగా విశ్రాంతికే అలవాటుపడిపోతారు. ఏదైనా చేయాల‌నుకున్నా శ‌రీరం స‌హ‌క‌రించ‌దు.

ఒక వ‌య‌సు దాటాక చాలామంది పెద్దవాళ్లు ఇక తమ పని అయిపోయిందనుకుంటూ పూర్తిగా విశ్రాంతికే అలవాటుపడిపోతారు. ఏదైనా చేయాల‌నుకున్నా శ‌రీరం స‌హ‌క‌రించ‌దు. కానీ.. ఈ తాత మాత్రం చాలా డిఫ‌రెంట్. పండు ముస‌లి అయినా కూడా క్రికెట్ ఆడుతూ యూత్‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నాడు. ఈ తాత క్రికెట్‌ ఆడుతున్న వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ తాత కుర్రాళ్లతో కలిసి క్రికెట్‌ ఆడుతున్నాడు. యువకులను మించి హుషారుగా కనిపిస్తున్న ఆ తాత క్రికెట్‌ గ్రౌండ్‌లో పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. ఎంతో ఉత్సాహంగా క్రికెట్‌ ఆడుతున్న ఆ తాతను చూసి చుట్టూ ఉన్నవాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. తాత ఎంతో హుషారుగా క్రికెట్ ఆడుతున్న వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. చివ‌రి శ్వాస వ‌ర‌కు కూడా భార‌త్‌లో క్రికెట్ బ‌తికే ఉంటుంది..