Watch Video: పోలీసులపై చింతమనేని దౌర్జన్యం.. ఈ సెక్షన్ల కింద 94వ కేసు నమోదు..

|

May 18, 2024 | 1:17 PM

మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‎పై కేసు నమోదు చేశారు పోలీసులు. పెదవేగి పోలీస్‌స్టేషన్‌పై దాడి ఘటనలో పోలీసులు సీరియస్‌ అయ్యరు. సీఐ స్థాయి అధికారులతో రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పాడి కేసు దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్ట్‌ చేయడం కోసం రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు టీడీపీ నేత చింతమనేనితోపాటు మరో 30మందిపై కేసులు నమోదు చేశారు.

మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‎పై కేసు నమోదు చేశారు పోలీసులు. పెదవేగి పోలీస్‌స్టేషన్‌పై దాడి ఘటనలో పోలీసులు సీరియస్‌ అయ్యరు. సీఐ స్థాయి అధికారులతో రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పాడి కేసు దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్ట్‌ చేయడం కోసం రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు టీడీపీ నేత చింతమనేనితోపాటు మరో 30మందిపై కేసులు నమోదు చేశారు. పోలీస్‌ కస్టడీలో ఉన్న ముద్దాయిని దౌర్జన్యంగా తీసుకెళ్లిన చింతమనేనిపై 224, 225, 353, 149 ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. పోలింగ్‌ రోజున అల్లర్లలో చింతమనేని అనుచరుడు రాజశేఖర్‌పై కేసు నమోదైంది. మే 16న రాజశేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తన అనుచరులతో స్టేషన్‌కు వెళ్లిన చింతమనేని.. రాజశేఖర్‌ను స్టేషన్ లోపలి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని బలవంతంగా తీసుకెళ్లే క్రమంలో తమపై దౌర్జన్యం చేశారంటూ పెదవేగి పోలీసులు రంగంలోకి దిగి చింతమనేనిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇప్పటికే చింతమనేని ప్రభాకర్ పై వివిధ పోలీస్ స్టేషన్లలో 93 కేసులు నమోదయ్యాయి. ఈరోజు ఆయనపై నమోదైనది 94వ కేసు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Published on: May 18, 2024 01:16 PM