Non-veg Food: నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా.?
ఆదివారం అంటే నాన్‌వెజ్ ప్రియులకు పండగే. తెల్లవారుతూనే మాంసం దుకాణలకు పరుగెత్తుతారు. రకరకాల మాంసాహారం కొని తెచ్చుకొని వండుకుని ఆరగిస్తారు. అలాంటి వారందరికీ ఓ సూచన చేస్తున్నారు ఆరోగ్య నిపుణులు. మాంసాహారం ఆరోగ్యానికి మంచిదే కానీ, కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఉంటాయి. నెలరోజుల పాటు మాంసాహారం తినడం మానేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.
నెల రోజుల పాటు నాన్ వెజ్‌కు దూరంగా ఉండటంతో జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుంది. దీంతో జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మలబద్దకం, అజీర్తి నుంచి ఉపశమనం కలుగుతుంది. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు. అధిక రక్తపోటు సమస్య తగ్గి, ఎముకల బలం పెరుగుతుంది. రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. ఆర్దరైటిస్, వాపులు, నొప్పులు తగ్గుతాయని అంటున్నారు. మాంసాహారాన్ని అధికంగా తీసుకోవాడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఎర్రటి మాంసాన్ని తరచూ తీసుకోవటం వల్ల క్యాన్సర్‌తో సహా కొన్ని వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. నాన్‌వెజ్‌లో సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం అవుతాయి. నాన్‌వెజ్‌కు దూరంగా ఉంటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ గణణీయంగా తగ్గుతుంది.
అయితే, మాంసాహారాలన్నీ ఒకే స్థాయి ప్రమాదాన్ని కలిగించవు. చేపలు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా చేర్చుకోవచ్చు. అలాగే, మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు ఒక నెల రోజుల పాటు నాన్‌వెజ్‌కు దూరంగా ఉంటే చాలా మంచిది. ఇలా చేయడంతో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. రక్తపోటు కంట్రోల్ అవుతుంది. హై బీపీతో ఇబ్బంది పడేవారు ఒక నెల రోజుల పాటు నాన్‌వెజ్‌కు దూరంగా ఉండి చూడండి. నెల రోజుల పాటు నాన్‌వెజ్‌కు దూరంగా ఉండి కేవలం కూరగాయలను మాత్రమే తీసుకోవడంతో శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్ అన్నీ అందుతాయి. శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.