CM Jagan: కొత్త జంటకు ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చిన సీఎం జగన్‌.. వీడియో చూసేయండి..

|

Mar 28, 2024 | 3:03 PM

ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వివాహానికి హాజరుకావాలంటే రాజకీయ నాయకులైనా అయ్యి ఉండాలి. లేదా పెద్ద వ్యాపారవేత్త లేదా సెలబ్రిటీలు అయినా అయ్యి ఉండాలి. అలా కాకుండా సామాన్య జంట వివాహానికి హాజరై కొత్త జంటను ఆశీర్వదిస్తే అది కచ్చితంగా ఆసక్తికరమే కదూ.! తాజాగా ఇలాంటి ఘటన నిజంగా జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి...

ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వివాహానికి హాజరుకావాలంటే రాజకీయ నాయకులైనా అయ్యి ఉండాలి. లేదా పెద్ద వ్యాపారవేత్త లేదా సెలబ్రిటీలు అయినా అయ్యి ఉండాలి. అలా కాకుండా సామాన్య జంట వివాహానికి హాజరై కొత్త జంటను ఆశీర్వదిస్తే అది కచ్చితంగా ఆసక్తికరమే కదూ.! తాజాగా ఇలాంటి ఘటన నిజంగా జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగానే గురువారం సీఎం జగన్‌… రెండో రోజు బస్సు యాత్ర ఆళ్లగడ్డ నుంచి సాగింది. ఎర్రగుంట్ల గ్రామంలో ప్రజలతో మాట్లాడారు. ఇందులో భాగంగానే ఎర్రగుంట్లకు వెళ్లేదారిలో జంట వెంకటస్వామి, కావేరి అనే కొత్త జంటకు వివాహం జరుగుతోంది. దీంతో బస్సులో నుంచి బయటకు వచ్చిన సీఎం జగన్ కొత్త జంటను ఆశీర్వాదించి, శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఊహించిని విధంగా సీఎం తమ వివాహానికి రావడంతో న్యూ కపుల్‌ ఫుల్ ఖుషీ అయ్యారు.