Dehydration: డీహైడ్రేషన్‌ రావడానికి కారణాలు ఏమిటి? ఎలక్ట్రోలైట్స్‌ డీహైడ్రేషన్‌తో ఎలా సహాయపడతాయి

|

Sep 20, 2023 | 5:13 PM

డీహైడ్రేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వ్యక్తులను ప్రభావితం చేసే ఒక క్లిష్టమైన ఆరోగ్య సమస్య. జ్వరం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, జబ్బులు వంటి అతిసారాన్ని మించిన అనారోగ్య సమస్యలు ఉన్నాయి. డెంగ్యూ, మలేరియా అనేవి సాధారణంగా డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. ఇలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తడానికి సాధారణ ప్రజలలో అవగాహన..

“పవర్ అప్ విత్ ఎలక్ట్రోలైట్స్” పేరుతో డీహైడ్రేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక విభాగంలో డాక్టర్ పాపారావు నడకుదురు, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, సిటిజన్ స్పెషాలిటీ హాస్పిటల్, హైదరాబాద్, డాక్టర్ అబ్దుల్ మజీద్ ఖాన్, కన్సల్టెంట్ ఫిజీషియన్ – ఆలివ్ హాస్పిటల్ హైదరాబాద్ మరియు డాక్టర్ సి. సురేష్‌లతో సహా వైద్య నిపుణులను తీసుకురానున్నారు. అలాగే కుమార్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, RVM ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్; అపోలో క్రెడిల్ హాస్పిటల్, జూబ్లీ హిల్స్ హైదరాబాద్, సరైన హైడ్రేషన్, ముఖ్యంగా జ్వరం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, వేడి జబ్బులు వంటి, అతిసారం వంటి వ్యాధులలో డీహైడ్రేషన్, మనిషి శక్తిని కోల్పోవడం వంటి వాటిలో సరైన చికిత్సలో ఎలక్ట్రోలైట్స్, ఎనర్జీ పోషించే కీలక పాత్రపై అవగాహన కల్పించేందుకు ఒక చర్చ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వ్యాపిస్తున్న డెంగ్యూ, మలేరియా వంటివి డీహైడ్రేషన్‌కు దారితీస్తోంది. వీటిపై ఈ డాక్టర్లు అవగాహన కల్పించనున్నారు.

డీహైడ్రేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వ్యక్తులను ప్రభావితం చేసే ఒక క్లిష్టమైన ఆరోగ్య సమస్య. జ్వరం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, జబ్బులు వంటి అతిసారాన్ని మించిన అనారోగ్య సమస్యలు ఉన్నాయి. డెంగ్యూ, మలేరియా అనేవి సాధారణంగా డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. ఇలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తడానికి సాధారణ ప్రజలలో అవగాహన లేకపోవడమే కారణం. సాధారణంగా ఈ అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు హైడ్రేటెడ్‌గా ఉండి, మంచి ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. డీహైడ్రేషన్‌ అనేది శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు సంభవిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు అధికంగా నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరంలో తగినంత ఎలక్ట్రోలైట్స్ లేకుంటే హైడ్రేషన్ అసంపూర్తిగా ఉంటుంది.

డీహైడ్రేషన్‌ అనేది నీటిని కోల్పోవడమే కాకుండా సోడియం, కాల్షియం, పొటాషియం, క్లోరైడ్ వంటి అవసరమైన ఎలక్ట్రోలైట్‌లను కూడా కోల్పోతుంది. ఈ ఎలక్ట్రోలైట్లు ద్రవ సమతుల్యతను, అలాగే కండరాల పనితీరును నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే వాటి క్షీణత కారణంగా కొన్ని అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అయితే డీహైడ్రేషన్‌ అనేది ఎక్కువ నీరు తాగడం మాత్రమే కాదని గమనించాలి. ఇది అవసరమైన ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను నిర్వహించడం కూడా చాలా అవసరం.

డీహైడ్రేషన్‌ను సమర్థవంతంగా ఎలా పరిష్కరించాలో, వేడి సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తడం, అలాగే ఆ సమస్యల ప్రభావాన్ని ఎలా తగ్గించుకోవాలో ఈ వీడియోను చూడండి.

Published on: Sep 16, 2023 03:30 PM