గుజరాత్ లోక్ సభ నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలు - Gujarat Lok Sabha Constituencies wise Result
గుజరాత్ పశ్చిమ భారతదేశంలో ఉన్న రాష్ట్రం. ఇది దేశంలోని సంపన్న రాష్ట్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ రాష్ట్రం అంతర్జాతీయ సరిహద్దును కూడా పంచుకుంటుంది. గుజరాత్ తన వాయువ్య సరిహద్దులో పాకిస్తాన్‌తో సరిహద్దును కలిగి ఉంది. గుజరాత్‌కు ఉత్తరాన రాజస్థాన్ ఉంది. ఈశాన్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉండగా.. దక్షిణాన మహారాష్ట్ర రాష్ట్రం ఉంది. అరేబియా సముద్రం దాని పశ్చిమ-దక్షిణ సరిహద్దుగా ఉంది. దాద్రా, నగర్ హవేలీ ప్రాంతం కూడా గుజరాత్‌కు ఆనుకుని ఉంది. విస్తీర్ణంలో దేశంలో గుజరాత్ ఐదో అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. జనాభా ప్రకారం తొమ్మిదో అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. గుజరాత్ రాజధాని గాంధీనగర్ కాగా.. అహ్మదాబాద్ అతిపెద్ద నగరంగా ఉంది. 2011 జనాభా లెక్కల మేరకు గుజరాత్ రాష్ట్ర జనాభా 6.03 కోట్లుగా ఉంది.
గుజరాత్లో 26 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం కూడా ఇదే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోని మొత్తం 26 స్థానాలను గెలుచుకుంది. గుజరాత్ అసెంబ్లీలో 182 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం గుజరాత్లో బీజేపీ అధికారంలో ఉంది. భూపేంద్ర పటేల్ ఆ రాష్ట్రంగా ఉన్నారు.
గుజరాత్ లోక్‌సభ స్థానాల జాబితా
రాష్ట్రం | సీటు | అభ్యర్థి పేరు | ఓటు | పార్టీ | స్థితి |
---|---|---|---|---|---|
Gujarat | Surat | MUKESH DALAL | - | BJP | Won |
Gujarat | Rajkot | PARASOTTAM RUPALA | 857984 | BJP | Won |
Gujarat | Junagadh | CHUDASAMA RAJESHBHAI NARANBHAI | 584049 | BJP | Won |
Gujarat | Banaskantha | GANIBEN THAKOR | 671883 | INC | Won |
Gujarat | Porbandar | MANSUKH MANDVIA | 633118 | BJP | Won |
Gujarat | Ahmedabad East | PATEL HASMUKHBHAI SOMABHAI | 770459 | BJP | Won |
Gujarat | Dahod | JASHVANTSINH SUMANBHAI BHABHOR | 688715 | BJP | Won |
Gujarat | Sabarkantha | SHOBHANABA BARAIAH | 677318 | BJP | Won |
Gujarat | Vadodara | HEMANG JOSHI | 873189 | BJP | Won |
Gujarat | Bardoli | PARBHUBHAI NAGARBHAI VASAVA | 763950 | BJP | Won |
Gujarat | Navsari | C R PATIL | 1031065 | BJP | Won |
Gujarat | Mahesana | HARIBHAI PATEL | 686406 | BJP | Won |
Gujarat | Anand | PATEL MITESH RAMESHBHAI (BAKABHAI) | 612484 | BJP | Won |
Gujarat | Bhavnagar | NIMUBAHEN BAMBHANIA | 716883 | BJP | Won |
Gujarat | Amreli | BHARAT SUTARIA | 580872 | BJP | Won |
Gujarat | Bharuch | MANSUKHBHAI VASAVA | 608157 | BJP | Won |
Gujarat | Gandhinagar | AMIT SHAH | 1010972 | BJP | Won |
Gujarat | Surendranagar | CHANDUBHAI SHIHORA | 669749 | BJP | Won |
Gujarat | Panchmahal | RAJPAL JADAV | 794579 | BJP | Won |
Gujarat | Kachchh | CHAVDA VINOD LAKHAMSHI | 659574 | BJP | Won |
Gujarat | Patan | DABHI BHARATSINHJI SHANKARJI | 591947 | BJP | Won |
Gujarat | Valsad | DHAVAL PATEL | 764226 | BJP | Won |
Gujarat | Chhota Udaipur | JASHUBHAI RATHWA | 796589 | BJP | Won |
Gujarat | Jamnagar | POONAMBEN HEMATBHAI MAADAM | 620049 | BJP | Won |
Gujarat | Ahmedabad West | DINESH MAKWANA | 611704 | BJP | Won |
Gujarat | Kheda | CHAUHAN DEVUSINH | 744435 | BJP | Won |
పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుకు ఆనుకుని ఉన్న గుజరాత్ భారతదేశంలోని సంపన్న రాష్ట్రాలలో ఒకటి. గుజరాత్ ఉత్తరాన రాజస్థాన్, ఈశాన్యంలో మధ్యప్రదేశ్ సరిహద్దులుగా ఉంది. దక్షిణాన మహారాష్ట్ర ఉంది. పశ్చిమాన అరేబియా సముద్రం ఉంది. గతంలో ఇది ముంబై రాష్ట్రంలో భాగంగా ఉండేది. ప్రత్యేక రాష్ట్రం కోసం సుదీర్ఘ పోరాటం, మరాఠీ, గుజరాతీ మాట్లాడేవారి మధ్య హింసాత్మక ఘర్షణల తర్వాత ముంబై రాష్ట్రం మే 1, 1960న విభజించబడింది. బొంబాయి రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విభజించి గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలు ఏర్పాటు చేశారు.
గుజరాత్లో భారతీయ జనతా పార్టీ సుదీర్ఘకాలంగా అధికారంలో ఉంది. ప్రస్తుతం ఇక్కడ భూపేంద్ర పటేల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా కూడా గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు. 2022లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 156 సీట్లు గెలుచుకోగా..ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 17 స్థానాలకే పరిమితమైంది. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇక్కడ 5 సీట్లుు గెలుచుకుంది. గుజరాత్ రాష్ట్రంలో మొత్తం 26 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో అంటే 2019లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదు. ఈసారి కూడా క్లీన్ స్వీప్ విజయాన్ని నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.
ప్రశ్న - 2019 లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్లో బీజేపీ ఓట్ల శాతం ఎంత?
సమాధానం – గుజరాత్లో బీజేపీకి 62.21% ఓట్లు వచ్చాయి.
ప్రశ్న: గుజరాత్లో ఎన్ని లోక్‌సభ స్థానాలు ఉన్నాయి?
సమాధానం - 26
ప్రశ్న - 2019 లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్లో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుచుకుంది?
సమాధానం - 0
ప్రశ్న - 2019లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏ స్థానంలో గెలిచారు?
సమాధానం: గాంధీనగర్ పార్లమెంట్ స్థానం నుంచి అమిత్ షా విజయం సాధించారు.
ప్రశ్న - 2019 పార్లమెంటు ఎన్నికల్లో గుజరాత్లో ఓటింగ్ శాతం ఎంత?
సమాధానం - గుజరాత్లో 64.51% ఓటింగ్ జరిగింది.
ప్రశ్న - భూపేంద్ర పటేల్ కంటే ముందు గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరు?
సమాధానం - విజయ్ రూపానీ.
ప్రశ్న - 2019 ఎన్నికల్లో గుజరాత్లో బీజేపీ ఎన్ని సీట్లు గెలుచుకుంది?
సమాధానం - మొత్తం 26 సీట్లలో అన్ని స్థానాలు గెలుచుకుంది.
ప్రశ్న - నరేంద్ర మోడీ కంటే ముందు, దేశానికి ప్రధాని అయిన గుజరాత్‌కు చెందిన నాయకుడు ఎవరు?
జవాబు - మొరార్జీ దేశాయ్. ఆయన దేశానికి మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి కూడా.
ప్రశ్న - నరేంద్ర మోదీ మొదటిసారి లోక్‌సభ ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేశారు?
సమాధానం - 2014 సంవత్సరంలో యూపీలోని వారణాసి లోక్‌సభ స్థానం నుండి పోటీచేసి గెలిచారు.
ప్రశ్న - నరేంద్ర మోదీ తొలిసారిగా ఏ సంవత్సరంలో ముఖ్యమంత్రి అయ్యారు?
సమాధానం - నరేంద్ర మోడీ 3 అక్టోబర్ 2001న గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు.