టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా మైండ్ బ్లాంక్

|

Dec 18, 2024 | 6:20 PM

వాళ్లిద్దరూ బీహార్ నుంచి వచ్చారు. ఇక్కడే మేడ్చల్ జిల్లాలోని పోచారం ఐటీ కారిడార్‌లో టీ కొట్టు ప్లస్ ఫుడ్ కోర్టు పెట్టుకున్నారు. ముందుగా వ్యాపారం బాగానే సాగింది. అయితే ఆ తర్వాత వారిద్దరి వ్యాపారంపై కొంచెం అనుమానమొచ్చింది. పోలీసులు నిఘా పెట్టారు. దగ్గర నుంచి వాచ్ చేశారు. అంతే.! ఎంక్వయిరీలో ఓ షాకింగ్ విషయం బయటపడింది.. అదేంటంటే

మేడ్చల్ జిల్లాలోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి అన్నోజిగూడలో ముందస్తు సమాచారంతో ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు. గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న రామ్ నారాయణ్, కిషోర్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. బీహార్‌కి చెందిన ఈ ఇద్దరు వ్యక్తులు టి కొట్టు ముసుగులో గంజాయి చాక్లెట్‌ల దందా కొనసాగించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 1 కేజీకి పైగా గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో సహా ఇద్దరు నిందితులను పోచారం పోలీసులకు అప్పగించారు ఎస్ఓటీ పోలీసులు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోచారం ఐటి కారిడార్ పోలీసులు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి