ఏపీలోని అనకాపల్లిలో బిర్యానీపై బంపర్ ఆఫర్ ప్రకటించారు. హోటల్ ఓపనింగ్ రోజు కావడంతో కేవలం రూ.4లకే చికెన్ బిర్యానీ ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో బిర్యానీ కొనుగోలు చేసేందుకు భారీ సంఖ్యలో జనం క్యూకట్టారు. భారీ సంఖ్యలో జనం చేరుకోవడంతో వారిని కట్టడి చేయడం హోటల్ నిర్వాహకులకు కష్టతరంగా మారింది.