Telangana: భద్రాద్రి రాములోరి వెండి ఇటుక మాయం

|

Feb 17, 2024 | 1:21 PM

ఇప్పుడు దేశంలో కేజీ వెండి ధర దాదాపుగా 75వేలపైన ఉంది. మరి ఇప్పుడు రాములోరి ఆలయంలో 6 కిలోల వెండి అంటే దాదాపు ఐదు లక్షలు విలువ చేసే వెండి మాయమైనట్లే.. ప్రస్తుతం ఆలయంలో ఆడిట్‌ జరుగుతుంది కనుక 6 కిలోల వెండి లేకపోతే సంబంధిత సిబ్బంది నుంచి..రివకరీ చేసి చర్యలు తీసుకుంటాం అంటూ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు ఈవో.. 

— భద్రాచలం రాములోరి వెండి ఇటుక మాయమైంది. మరి కనిపించకుండా పోయింది ఇటుక మాత్రమేనా.. ఇంకా ఏమైనా ఉన్నాయా అనేది లెక్కలు తేలాల్సి ఉంది.  స్వామివారి ఆభరణాలకు సంబంధించి ఏటా నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో వెండి ఇటుక మాయమైనట్లు వెలుగులోకి వచ్చింది. ఆరు కేజీల వెండి ఇటుక ఉన్నట్లు రికార్డుల్లో నమోదై ఉన్నా..అది కనిపించలేదు.. దీనిపై దేవస్థానం ఈవో రమాదేవిని వివరణ కోరగా.. వెండి ఇటుక కనిపించకపోతే సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ రికవరీ చేస్తామని, ఈ విషయంలో ఎవరినీ వదిలేది లేదని చెప్పారు.

అయితే ప్రస్తుత నివేదిక ప్రకారం స్వామివారికి 67.774 కిలోల బంగారం, 980.68 కిలోల వెండి ఉంది. 2009 తర్వాత పూర్తి స్థాయి తనిఖీ ఇప్పుడే జరుగుతోంది. ఇది పూర్తయితే ఆడిట్ నివేదిక తర్వాతే పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది. బంగారం, వెండి, నగదు లావాదేవీల్లో తప్పు చేసినట్లు తేలితే క్రమశిక్షణ చర్యలు తప్పవని దేవస్థానం ఈవో రమాదేవి హెచ్చరించారు.

ఇప్పుడు దేశంలో కేజీ వెండి ధర దాదాపుగా 75వేలపైన ఉంది. మరి ఇప్పుడు రాములోరి ఆలయంలో 6 కిలోల వెండి అంటే దాదాపు ఐదు లక్షలు విలువ చేసే వెండి మాయమైనట్లే.. ప్రస్తుతం ఆలయంలో ఆడిట్‌ జరుగుతుంది కనుక 6 కిలోల వెండి లేకపోతే సంబంధిత సిబ్బంది నుంచి..రివకరీ చేసి చర్యలు తీసుకుంటాం అంటూ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు ఈవో..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Feb 17, 2024 01:20 PM