ఉత్తర ప్రదేశ్ లోక్ సభ నియోజకవర్గాలు ఎన్నికల ఫలితాలు - Uttar Pradesh Lok Sabha Election Constituencies Wise Result
రాజకీయ కోణం నుండి ఉత్తరప్రదేశ్ దేశంలో అత్యంత ప్రాధాన్య రాష్ట్రంగా పరిగణించబడుతుంది. ఈ రాష్ట్రానికి చారిత్రక, పౌరాణిక, సాంస్కృతిక పరంగా చాలా ప్రాముఖ్యత ఉంది. ఉత్తరప్రదేశ్ ఇతిహాసాలు, పవిత్ర నదులు, పురాతన నగరాలు, తీర్థయాత్రలకు పేరుగాంచింది. 2011 జనాభా లెక్కల మేరకు 19.95 కోట్ల మంది జనాభాతో దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ఉంది. జనాభా పరంగా ఉత్తరప్రదేశ్ కంటే పెద్ద దేశాలు ప్రపంచంలో 5 మాత్రమే ఉన్నాయి. అవి- చైనా, భారత్, అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్ దేశాలు. ఆ రాష్ట్రానికి లక్నో రాజధానిగా ఉంది.
రాముడు, కృష్ణుడు, గౌతమ బుద్ధుడు, మహావీరుల కాలం నుండి రాష్ట్రం సాంస్కృతిక, మేధో ప్రతిభకు కేంద్రంగా ఉంది. ఆధునిక కాలంలో యూపీ రాష్ట్రం ఎక్స్‌ప్రెస్‌వేలు, పారిశ్రామిక కారిడార్లు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, విద్యా, వైద్య నైపుణ్యాల కేంద్రాలు, స్వదేశీ ఉత్పత్తుల ఎగుమతిదారుల నెట్‌వర్క్‌తో దేశ ఆర్థిక వ్యవస్థకు ఛోదకశక్తిగా ఎదుగుతోంది.
దేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ గెలిచిన పార్టీలు కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా వారణాసి లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారణాసితో పాటు రాజధాని లక్నో, అయోధ్య, గోరఖ్‌పూర్, ప్రయాగ్‌రాజ్, ఆగ్రా, మధుర, గౌతమ్ బుద్ధ నగర్, ఘజియాబాద్, కన్పూర్ ఆ రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాలు.
ఉత్తర ప్రదేశ్ లోక్‌సభ స్థానాల జాబితా
రాష్ట్రం | సీటు | అభ్యర్థి పేరు | ఓటు | పార్టీ | స్థితి |
---|---|---|---|---|---|
Uttar Pradesh | Kannauj | AKHILESH YADAV | 642292 | SP | Won |
Uttar Pradesh | Mirzapur | ANUPRIYA PATEL | 471631 | ADAL | Won |
Uttar Pradesh | Ghaziabad | ATUL GARG | 854170 | BJP | Won |
Uttar Pradesh | Amroha | KANWAR SINGH TANWAR | 476506 | BJP | Won |
Uttar Pradesh | Aonla | NEERAJ MAURYA | 492515 | SP | Won |
Uttar Pradesh | Firozabad | AKSHAY YADAV | 543037 | SP | Won |
Uttar Pradesh | Mainpuri | DIMPLE YADAV | 598526 | SP | Won |
Uttar Pradesh | Badaun | ADITYA SINGH YADAV | 501855 | SP | Won |
Uttar Pradesh | Amethi | KISHORI LAL SHARMA | 539228 | INC | Won |
Uttar Pradesh | Etawah | JITENDRA KUMAR DOHARE | 490747 | SP | Won |
Uttar Pradesh | Dhaurahra | ANAND BHADAURIYA | 443743 | SP | Won |
Uttar Pradesh | Sitapur | RAKESH RATHOR | 531138 | INC | Won |
Uttar Pradesh | Jhansi | ANURAG SHARMA | 690316 | BJP | Won |
Uttar Pradesh | Rae Bareli | RAHUL GANDHI | 687649 | INC | Won |
Uttar Pradesh | Banda | KRISHNA DEVI SHIVSHANKER PATEL | 406567 | SP | Won |
Uttar Pradesh | Sultanpur | RAMBHUAL NISHAD | 444330 | SP | Won |
Uttar Pradesh | Ghazipur | AFZAL ANSARI | 539912 | SP | Won |
Uttar Pradesh | Kanpur | RAMESH AWASTHI | 443055 | BJP | Won |
Uttar Pradesh | Fatehpur | NARESH CHANDRA UTTAM PATEL | 500328 | SP | Won |
Uttar Pradesh | Bahraich | ANAND KUMAR | 518802 | BJP | Won |
Uttar Pradesh | Kaiserganj | KARAN BHUSHAN SINGH | 571263 | BJP | Won |
Uttar Pradesh | Nagina | CHANDRASHEKHAR | 512552 | ASPKR | Won |
Uttar Pradesh | Deoria | SHASHANK MANI TRIPATHI | 504541 | BJP | Won |
Uttar Pradesh | Salempur | RAMASHANKAR RAJBHAR | 405472 | SP | Won |
Uttar Pradesh | Jaunpur | BABU SINGH KUSHWAHA | 509130 | SP | Won |
Uttar Pradesh | Machhlishahr | PRIYA SAROJ | 451292 | SP | Won |
Uttar Pradesh | Maharajganj | PANKAJ CHAUDHARY | 591310 | BJP | Won |
Uttar Pradesh | Gorakhpur | RAVINDRA SHYAMNARAYAN SHUKLA URF RAVI KISHAN | 585834 | BJP | Won |
Uttar Pradesh | Ballia | SANATAN PANDEY | 467068 | SP | Won |
Uttar Pradesh | Baghpat | DR RAJKUMAR SANGWAN | 488967 | RLD | Won |
Uttar Pradesh | Chandauli | BIRENDRA SINGH | 474476 | SP | Won |
Uttar Pradesh | Bhadohi | DR. VINOD KUMAR BIND | 459982 | BJP | Won |
Uttar Pradesh | Pratapgarh | SHIV PAL SINGH PATEL (DR. S P SINGH) | 441932 | SP | Won |
Uttar Pradesh | Gautam Buddha Nagar | MAHESH SHARMA | 857829 | BJP | Won |
Uttar Pradesh | Ambedkar Nagar | LALJI VERMA | 544959 | SP | Won |
Uttar Pradesh | Domariyaganj | JAGDAMBIKA PAL | 463303 | BJP | Won |
Uttar Pradesh | Moradabad | RUCHI VIRA | 637363 | SP | Won |
Uttar Pradesh | Akbarpur | DEVENDRA SINGH ALIAS BHOLE SINGH | 517423 | BJP | Won |
Uttar Pradesh | Fatehpur Sikri | RAJKUMAR CHAHAR | 445657 | BJP | Won |
Uttar Pradesh | Aligarh | SATISH KUMAR GAUTAM | 501834 | BJP | Won |
Uttar Pradesh | Kushi Nagar | VIJAY KUMAR DUBAY | 516345 | BJP | Won |
Uttar Pradesh | Rampur | MOHIBBULLAH | 481503 | SP | Won |
Uttar Pradesh | Bansgaon | KAMLESH PASWAN | 428693 | BJP | Won |
Uttar Pradesh | Agra | PROF S P SINGH BAGHEL | 599397 | BJP | Won |
Uttar Pradesh | Faizabad | AWADHESH PRASAD | 554289 | SP | Won |
Uttar Pradesh | Robertsganj | CHHOTELAL | 465848 | SP | Won |
Uttar Pradesh | Mathura | HEMA MALINI | 510064 | BJP | Won |
Uttar Pradesh | Etah | DEVESH SHAKYA | 475808 | SP | Won |
Uttar Pradesh | Shahjahanpur | ARUN KUMAR SAGAR | 592718 | BJP | Won |
Uttar Pradesh | Allahabad | UJJWAL REVATI RAMAN SINGH | 462145 | INC | Won |
Uttar Pradesh | Gonda | KIRTI VARDHAN SINGH ALIAS RAJA BHAIYA | 474258 | BJP | Won |
Uttar Pradesh | Bulandshahr | DR BHOLA SINGH | 597310 | BJP | Won |
Uttar Pradesh | Bijnor | CHANDAN CHAUHAN | 404493 | RLD | Won |
Uttar Pradesh | Sambhal | ZIA UR REHMAN | 571161 | SP | Won |
Uttar Pradesh | Bareilly | CHHATRA PAL SINGH GANGWAR | 567127 | BJP | Won |
Uttar Pradesh | Lucknow | RAJNATH SINGH | 612709 | BJP | Won |
Uttar Pradesh | Sant Kabir Nagar | LAXMIKANT PAPPU NISHAD | 498695 | SP | Won |
Uttar Pradesh | Ghosi | RAJEEV RAI | 503131 | SP | Won |
Uttar Pradesh | Pilibhit | JITIN PRASADA | 607158 | BJP | Won |
Uttar Pradesh | Misrikh | ASHOK KUMAR RAWAT | 475016 | BJP | Won |
Uttar Pradesh | Hamirpur | AJENDRA SINGH LODHI | 490683 | SP | Won |
Uttar Pradesh | Barabanki | TANUJ PUNIA | 719927 | INC | Won |
Uttar Pradesh | Kheri | UTKARSH VERMA (MADHUR) | 557365 | SP | Won |
Uttar Pradesh | Mohanlalganj | R K CHAUDHARY | 667869 | SP | Won |
Uttar Pradesh | Phulpur | PRAVEEN PATEL | 452600 | BJP | Won |
Uttar Pradesh | Jalaun | NARAYAN DAS AHIRWAR | 530180 | SP | Won |
Uttar Pradesh | Meerut | ARUN GOVIL | 546469 | BJP | Won |
Uttar Pradesh | Unnao | SAKSHI MAHARAJ | 616133 | BJP | Won |
Uttar Pradesh | Lalganj | DAROGA PRASAD SAROJ | 439959 | SP | Won |
Uttar Pradesh | Muzaffarnagar | HARENDRA SINGH MALIK | 470721 | SP | Won |
Uttar Pradesh | Kairana | IQRA CHOUDHARY | 528013 | SP | Won |
Uttar Pradesh | Shrawasti | RAM SHIROMANI | 511055 | SP | Won |
Uttar Pradesh | Kaushambi | PUSHPENDRA SAROJ | 509787 | SP | Won |
Uttar Pradesh | Azamgarh | DHARMENDRA YADAV | 508239 | SP | Won |
Uttar Pradesh | Saharanpur | IMRAN MASOOD | 547967 | INC | Won |
Uttar Pradesh | Varanasi | NARENDRA MODI | 612970 | BJP | Won |
Uttar Pradesh | Farrukhabad | MUKESH RAJPUT | 487963 | BJP | Won |
Uttar Pradesh | Hathras | ANOOP PRADHAN BALMIKI | 554746 | BJP | Won |
Uttar Pradesh | Hardoi | JAI PRAKASH | 486798 | BJP | Won |
Uttar Pradesh | Basti | RAM PRASAD CHAUDHARY | 527005 | SP | Won |
దేశంలోనే అత్యధికంగా 80 లోక్‌సభ స్థానాలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. జనాభా పరంగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం. విస్తీర్ణం పరంగా చూసుకుంటే దేశంలో నాలుగో స్థానంలో ఉంది. లక్నో, ఆగ్రా, అయోధ్య, అలీఘర్, కాన్పూర్, ఝాన్సీ, వారణాసి, గోరఖ్‌పూర్, మధుర మొదలైనవి ఈ రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాలు. ఉత్తర ప్రదేశ్ ఈశాన్యంలో నేపాల్ దేశంతో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది. ప్రస్తుతం యూపీలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధికారంలో ఉంది. యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎంగా ఉన్నారు.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం 24 జనవరి 1950న ఏర్పడింది. ఇందులో మొత్తం 75 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌కు కూడా పౌరాణిక చరిత్ర ఉంది. ప్రపంచంలోని పురాతన నగరాల్లో ఒకటిగా పరిగణించబడే వారణాసి నగరం ఇక్కడ ఉంది. ఈ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. ఈసారి ఆయన వరుసగా మూడోసారి వారణాసి స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో 80 లోక్‌సభ స్థానాలు ఉన్నందున.. ఇక్కడ ఎక్కువ స్థానాలు గెలుపొందే పార్టీయే దేశంలో అధికారంలోకి వచ్చే ఆనవాయితీ ఉంది. 2019 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 80 సీట్లలో 62 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్‌కు ఒక్క సీటు మాత్రమే దక్కింది. రాహుల్ గాంధీ కూడా ఇక్కడి అమేథీ నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. వీరితో పాటు జయంత్ చౌదరి, రాజ్ బబ్బర్, శివపాల్ సింగ్ యాదవ్, అక్షయ్ యాదవ్ వంటి పెద్దలు కూడా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. నాటి ఎన్నికల్లో సమాజ్‌వాదీ(ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) కలిసి పోటీ చేశాయి. ఈ కూటమి కేవలం 15 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఉత్తరప్రదేశ్‌కు సంబంధించిన ప్రశ్నలు, సమాధానాలు
ప్రశ్న - 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో ఎన్డీయే కూటమికి వచ్చిన ఓట్ల శాతం ఎంత?
జవాబు – యూపీలో ఎన్డీయే కూటమికి 51.19% ఓట్లు వచ్చాయి.
ప్రశ్న - యూపీలో అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిచిన సీటు ఏది?
సమాధానం- ఘజియాబాద్‌లో బీజేపీ అభ్యర్థి వీకే సింగ్ 5,01,500 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ప్రశ్న - మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కుమారుడు చౌదరి అజిత్ సింగ్ ఏ స్థానం నుంచి ఓడిపోయారు?
జవాబు: చౌదరి అజిత్ సింగ్ ముజఫర్‌నగర్ స్థానం నుంచి ఓడిపోయారు.
ప్రశ్న - సీఎం యోగి ఆదిత్యనాథ్ పార్లమెంటరీ నియోజకవర్గమైన గోరఖ్‌పూర్ ఎంపీ ఎవరు?
సమాధానం- గోరఖ్‌పూర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రవి కిషన్ ఎంపీగా గెలిచారు.
ప్రశ్న - ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ అజంగఢ్ స్థానం నుంచి ఎవరిని ఓడించారు?
సమాధానం- బీజేపీ అభ్యర్థి దినేష్ లాల్ యాదవ్ నిరాహువా అఖిలేష్ యాదవ్ చేతిలో ఓడిపోయారు.
ప్రశ్న - ఉత్తరప్రదేశ్‌లో షెడ్యూల్డ్ కులాలకు ఎన్ని సీట్లు రిజర్వు చేయబడ్డాయి?
జవాబు- 17 సీట్లు షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడ్డాయి.
ప్రశ్న - యూపీలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఓట్ల శాతం ఎంత?
జవాబు: యూపీఏ ఓట్ల శాతం 6.41%.
ప్రశ్న - యూపీలో సినీ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద ఏ సీటులో ఓడిపోయారు?
జవాబు- రాంపూర్ లోక్‌సభ స్థానం
ప్రశ్న - ఎన్నికలకు ముందు బీఎస్పీ నుంచి బహిష్కరణకు గురైన కున్వర్ డానిష్ అలీ 2019లో ఎక్కడి నుంచి ఎన్నికయ్యారు?
సమాధానం - డానిష్ అలీ అమ్రోహా నుండి ఎంపీ అయ్యారు.
ప్రశ్న - 2019 ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హా యూపీలోని ఏ స్థానం నుంచి ఓడిపోయారు?
సమాధానం- ఘాజీపూర్ పార్లమెంట్ స్థానం నుంచి మనోజ్ సిన్హా ఓటమి పాలయ్యారు.