కేరళ లోక్‌ సభ నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలు - Kerala Lok Sabha Constituencies wise Result

కేరళ దక్షిణ భారతదేశంలో కూడా ఒక ముఖ్యమైన రాష్ట్రం. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి 1956 నవంబరు 1 న కేరళ పూర్తి స్థాయి రాష్ట్రంగా అవతరించింది. సుగంధ ద్రవ్యాలు, ప్రకృతి అందాలతో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను కేరళ ఆకట్టుకుంటోంది. కేరళ మలబార్ తీరం వెంబడి దాదాపు 360 మైళ్లు (580 కి.మీ) విస్తరించి ఉంది. 19వ శతాబ్దంలో కొచ్చిన్, తిరువాన్కూరు సంస్థానాలు చేపట్టిన సామాజిక సంస్కరణలను స్వాతంత్ర్యం తరువాత ఆ రాష్ట్రంలో వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించాయి. దీంతో అత్యధిక అక్షరాస్యత ఉన్న రాష్ట్రంగా.. అత్యంత ఆరోగ్యకరమైన ప్రాంతంగా కేరళ నిలుస్తోంది. కేరళలో 3.18 కోట్ల మంది జనాభా ఉన్నారు. జనాభా రీత్యా కేరళ దేశంలో 13వ అతిపెద్ద రాష్ట్రంలో నిలుస్తోంది.

కేరళకు ఉత్తరాన కర్ణాటక, తూర్పున తమిళనాడు, దక్షిణం, పశ్చిమాన అరేబియా సముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. పుదుచ్చేరిలో భాగమైన మహే కూడా కేరళకు వాయువ్య తీరంలో ఉంది. దీని రాజధాని తిరువనంతపురం (త్రివేండ్రం). కేరళలో 20 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 20 స్థానాలకు గానూ 15 స్థానాల్లో విజయం సాధించింది.

కేరళ లోక్‌సభ స్థానాల జాబితా

రాష్ట్రం సీటు అభ్యర్థి పేరు ఓటు పార్టీ స్థితి
Kerala Kozhikode M. K. RAGHAVAN 520421 INC Won
Kerala Ponnani DR. M.P ABDUSSAMAD SAMADANI 562516 IUML Won
Kerala Kasaragod RAJMOHAN UNNITHAN 490659 INC Won
Kerala Wayanad RAHUL GANDHI 647445 INC Won
Kerala Malappuram E.T. MOHAMMED BASHEER 644006 IUML Won
Kerala Chalakudy BENNY BEHANAN 394171 INC Won
Kerala Alappuzha KC VENUGOPAL 404560 INC Won
Kerala Mavelikkara KODIKUNNIL SURESH 369516 INC Won
Kerala Pathanamthitta ANTO ANTONY 367623 INC Won
Kerala Ernakulam HIBI EDEN 482317 INC Won
Kerala Attingal ADV ADOOR PRAKASH 328051 INC Won
Kerala Thiruvananthapuram SHASHI THAROOR 358155 INC Won
Kerala Kottayam ADV K FRANCIS GEORGE 364631 KC Won
Kerala Kollam N K PREMACHANDRAN 443628 RSP Won
Kerala Kannur K. SUDHAKARAN 518524 INC Won
Kerala Vadakara SHAFI PARAMBIL 557528 INC Won
Kerala Palakkad V K SREEKANDAN 421169 INC Won
Kerala Alathur K.RADHAKRISHNAN 403447 CPM Won
Kerala Thrissur SURESH GOPI 412338 BJP Won
Kerala Idukki ADV. DEAN KURIAKOSE 432372 INC Won

కేరళ ప్రకృతి అందాలకే కాదు సుగంధ ద్రవ్యాల సాగుకు కూడా ప్రసిద్ధి. దక్షిణ భారతదేశ చివరలో ఉన్న కేరళ, దేశంలోని ఉష్ణమండల మలబార్ తీరంలో ఉన్న ఒక చిన్న సుందరమైన రాష్ట్రం. ఈ రాష్ట్రం సుమారు 600 కి.మీ పొడవైన అరేబియా సముద్ర తీరాన్ని కలిగి ఉంది. కేరళ రాజధాని తిరువనంతపురం. ఇక్కడ మలయాళం అధికార భాష. ఈ రాష్ట్రంలో హిందువులు, ముస్లింలతో పాటు క్రైస్తవ మతానికి చెందిన ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. గాడ్స్ ఓన్ కంట్రీగా కేరళ ప్రసిద్ధి చెందింది.

ప్రస్తుతం కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్) ప్రభుత్వం ఉంది. సీపీఎం నేత పినరయి విజయన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. 140 మంది సభ్యులున్న కేరళ అసెంబ్లీలో ఎల్‌డీఎఫ్‌కి 99 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) కేవలం 41 సీట్ల బలం ఉంది. ఇక్కడ ఎలాగైనా బలపడాలని ప్రయత్నించిన భారతీయ జనతా పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు.

లోక్‌సభ ఎన్నికలతో కేరళలో మరోసారి రాజకీయాలు వేడెక్కాయి. గత ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన బీజేపీ ఈ ఎన్నికల్లో ఖాతా తెరవాలని ప్రయత్నిస్తోంది. 20 లోక్‌సభ స్థానాలున్న కేరళలో ప్రధాన పోటీ ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌ల మధ్యే ఉంటుందని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇక్కడి వయనాడ్ నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. యుపిలోని అమేథీ స్థానం నుండి కూడా అప్పటి ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన బిజెపికి చెందిన స్మృతి ఇరానీ చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. వయనాడ్ ఎంపీగా లోక్‌సభలో రాహుల్ ప్రాతినిథ్యంవహిస్తున్నారు. ఆయన మరోసారి ఇక్కడి నుంచి 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.

ప్రశ్న - కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈసారి ఎన్నికల్లో కేరళలోని ఏ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారు?

సమాధానం - వాయనాడ్ లోక్‌సభ స్థానం

ప్రశ్న - 2019లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి కేరళలోని ఎన్ని ఎంపీ స్థానాల్లో పోటీ చేసింది?

సమాధానం - మొత్తం 20 సీట్లలో పోటీ చేసింది

ప్రశ్న - 2019 లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఎన్ని సీట్లు గెలుచుకుంది?

సమాధానం: 20 సీట్లకు 19 గెలిచింది.

ప్రశ్న - కేరళలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయి?

జవాబు: ఎన్డీయే కూటమికి 15 శాతం ఓట్లు వచ్చాయి. కానీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది.

ప్రశ్న - 2019లో కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ తప్ప ఎవరు గెలిచారు?

సమాధానం: రాష్ట్రంలో అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఒక సీటును గెలుచుకుంది.

ప్రశ్న - వయనాడ్‌లో రాహుల్ గాంధీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయి?

సమాధానం - 37.46%

ప్రశ్న - 2019లో కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వంలో కేరళ నుంచి కేంద్రమంత్రిగా ఎవరిని నియమించారు?

సమాధానం - రాజ్యసభ ఎంపీ వి మురళీధరన్

ప్రశ్న - కేరళ ముఖ్యమంత్రి పేరు ఏమిటి?

సమాధానం - పినరయి విజయన్

ప్రశ్న - కేరళలో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం ఓటింగ్ శాతం ఎంత?

సమాధానం - 77.84% ఓటింగ్ జరిగింది.