కర్ణాటక లోక్ సభ నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలు - Karnataka Lok Sabha Election Constituencies wise Result
అరేబియా సముద్ర తీరంలోని కర్ణాటక దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన రాష్ట్రాలలో ఒకటి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం నవంబర్ 1, 1956న కర్ణాటక రాష్ట్రం ఏర్పడింది. కర్ణాటకను గతంలో మైసూర్ రాష్ట్రం అని పిలిచేవారు. కానీ 1973లో రాష్ట్రం పేరును కర్ణాటకగా మార్చారు. ఈ రాష్ట్రానికి పశ్చిమాన అరేబియా సముద్రం, వాయువ్యంలో గోవా, ఉత్తరాన మహారాష్ట్ర, తూర్పున ఆంధ్రప్రదేశ్, ఆగ్నేయంలో తమిళనాడు, దక్షిణాన కేరళ సరిహద్దులుగా ఉన్నాయి. విస్తీర్ణం మేరకు దక్షిణ భారత దేశంలో అతిపెద్ద రాష్ట్రంగా.. భారత దేశంలో ఆరో అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం కర్ణాటక రాష్ట్రంలో 6.11 కోట్ల మంది జనాభా ఉన్నారు. జనాభా మేరకు దేశంలో 8వ అతిపెద్ద రాష్ట్రమిది.
కర్ణాటక రాజధాని బెంగళూరు. ఈ నగరాన్ని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అంటారు. ఆ రాష్ట్రంలో 31 జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ అధికారిక, అత్యధికంగా మాట్లాడే భాష కన్నడ. కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలు ఉండగా, అందులో 2019 ఎన్నికల్లో బీజేపీ 25 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 2 సీట్లు గెలుచుకుంది. స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు.
కర్ణాటక లోక్‌సభ స్థానాల జాబితా
రాష్ట్రం | సీటు | అభ్యర్థి పేరు | ఓటు | పార్టీ | స్థితి |
---|---|---|---|---|---|
Karnataka | Bangalore Rural | DR C N MANJUNATH | 1079002 | BJP | Won |
Karnataka | Chikkballapur | DR.K.SUDHAKAR | 822619 | BJP | Won |
Karnataka | Davanagere | DR. PRABHA MALLIKARJUN | 633059 | INC | Won |
Karnataka | Udupi Chikmagalur | KOTA SRINIVAS POOJARY | 732234 | BJP | Won |
Karnataka | Dakshina Kannada | CAPTAIN BRIJESH CHOWTA | 764132 | BJP | Won |
Karnataka | Chitradurga | GOVIND KARJOL | 684890 | BJP | Won |
Karnataka | Chamarajanagar | SUNIL BOSE | 751671 | INC | Won |
Karnataka | Uttara Kannada | HEGDE VISHWESHWAR | 782495 | BJP | Won |
Karnataka | Bijapur | JIGAJINAGI RAMESH CHANDAPPA | 672781 | BJP | Won |
Karnataka | Gulbarga | RADHAKRISHNA | 652321 | INC | Won |
Karnataka | Dharwad | PRALHAD JOSHI | 716231 | BJP | Won |
Karnataka | Bangalore North | SHOBHA KARANDLAJE | 986049 | BJP | Won |
Karnataka | Bangalore Central | P C MOHAN | 658915 | BJP | Won |
Karnataka | Bangalore South | TEJASVI SURYA | 750830 | BJP | Won |
Karnataka | Tumkur | V. SOMANNA | 720946 | BJP | Won |
Karnataka | Mandya | H.D. KUMARASWAMY | 851881 | JD(S) | Won |
Karnataka | Koppal | K. RAJASHEKAR BASAVARAJ HITNAL | 663511 | INC | Won |
Karnataka | Hassan | SHREYAS. M. PATEL | 672988 | INC | Won |
Karnataka | Bidar | SAGAR ESHWAR KHANDRE | 666317 | INC | Won |
Karnataka | Bagalkot | GADDIGOUDAR PARVATAGOUDA CHANDANAGOUDA | 671039 | BJP | Won |
Karnataka | Kolar | M. MALLESH BABU | 691481 | JD(S) | Won |
Karnataka | Chikkodi | PRIYANKA SATISH JARKIHOLI | 713461 | INC | Won |
Karnataka | Haveri | BASAVARAJ BOMMAI | 705538 | BJP | Won |
Karnataka | Shimoga | B Y RAGHAVENDRA | 778721 | BJP | Won |
Karnataka | Raichur | G. KUMAR NAIK | 670966 | INC | Won |
Karnataka | Bellary | E. TUKARAM | 730845 | INC | Won |
Karnataka | Mysore | YADUVEER KRISHNADATTA CHAMARAJA WADIYAR | 795503 | BJP | Won |
Karnataka | Belgaum | JAGADISH SHETTAR | 762029 | BJP | Won |
దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రం నవంబర్ 1, 1956న ఏర్పడింది. అప్పట్లో దీనిని మైసూర్ అని పిలిచేవారు. 1973లో రాష్ట్రం పేరు కర్ణాటకగా మార్చబడింది. దక్షిణ భారతదేశంలోని సంపన్న రాష్ట్రాలలో ఒకటైన కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ రాష్ట్రానికి పశ్చిమాన అరేబియా సముద్రం, వాయువ్యంలో గోవా, ఉత్తరాన మహారాష్ట్ర, తూర్పున ఆంధ్ర ప్రదేశ్, ఆగ్నేయంలో తమిళనాడు, దక్షిణాన కేరళ సరిహద్దులుగా ఉన్నాయి.
గతేడాది ఇక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్‌కు చెందిన సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 స్థానాల్లో కాంగ్రెస్ 135 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ కేవలం 66 సీట్లకే పరిమితమైంది. జనతాదళ్ సెక్యులర్(జేడీఎస్) రాష్ట్రంలో మూడో అతిపెద్ద పార్టీగా అవతరించినా కేవలం 19 సీట్లు మాత్రమే వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ విడివిడిగా పోటీ చేయగా.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీల మధ్య పొత్తు కుదిరింది.
2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 25 స్థానాల్లో విజయం సాధించగా.. ఆ పార్టీ మద్ధతుతో పోటీచేసిన ఇండిపెండింట్ అభ్యర్థి సుమలత విజయం సాధించారు. పొత్తులో భాగంగా 21 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 1, 7 స్థానాల్లో పోటీచేసిన జేడీఎస్ 1 స్థానంలో విజయం సాధించాయి.
ప్రశ్న: కర్ణాటకలోని మొత్తం లోక్‌సభ స్థానాలు ఎన్ని?
సమాధానం: 28 లోక్‌సభ స్థానాలు
ప్రశ్న: 2019 ఎన్నికల్లో బీజేపీ ఎన్ని స్థానాలను గెలుచుకుంది?
సమాధానం: 25 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది.ఆ పార్టీ మద్ధతుతో పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థి సుమలత విజయం సాధించారు.
ప్రశ్న: 2019 ఎన్నికల్లో బీజేపీకి ఎంత శాతం ఓట్లు దక్కాయి?
సమాధానం: 51.75 శాతం
ప్రశ్న: 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంత శాతం ఓట్లు దక్కాయి?
సమాధానం: 32.11 శాతం
ప్రశ్న: 2019 ఎన్నికల్లో కర్ణాటకలో నమోదైన ఓటింగ్ శాతం ఎంత?
సమాధానం: 68.81 శాతం
ప్రశ్న: 2019లో సుమలత ఏ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు?
సమాధానం: మాండ్య లోక్‌సభ నియోజకవర్గం