AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోవా లోక్‌ సభ నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలు - Goa Lok Sabha Election Constituencies wise Result

భారత దేశపు పశ్చిమ తీరాన అరేబియా సముద్రం అంచున ఉన్న రాష్ట్రం గోవా. దీనికి ఉత్తరాన మహారాష్ట్ర, తూర్పు, దక్షిణాన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. వైశాల్యపరంగా గోవా భారత దేశంలో రెండో అతిచిన్న రాష్ట్రం. అలాగే జనాభా పరంగా దేశంలో నాల్గవ చిన్న రాష్ట్రం గోవా. అందం, అద్భుతమైన బీచ్‌ల కారణంగా ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులను గోవా ఆకర్షిస్తోంది. పోర్చుగీస్ వారు గోవాను సుమారు 450 సంవత్సరాలు పాలించారు. సుదీర్ఘ పోరాటం తర్వాత, పోర్చుగీస్ వారు 19 డిసెంబర్ 1961న ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టడంతో ఇది భారతదేశంలో భాగమైంది. గోవా రాష్ట్రానికి పనాజి రాజధాని కాగా.. ఆ రాష్ట్రంలోని అతిపెద్ద నగరం వాస్కోడిగామా.

గోవాలో మొత్తం 1,424 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ అటవీ ప్రాంతం ఉంది. ఇది ఆ రాష్ట్ర మొత్తం వైశాల్యంలో మూడింట ఒక వంతు ఆక్రమించింది. వెదురు, మరాఠా బెరడు, చిల్లర్ బెరడు, భిరాంద్ అటవీ ఉత్పత్తుల్లో ముఖ్యమైనవి. ఈ విషయాలు గ్రామీణ ప్రజలకు చాలా ఆర్థిక ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. గోవాలో జీడిపప్పు, మామిడి, జాక్‌ఫ్రూట్, పైనాపిల్ పండిస్తారు. గోవా రాష్ట్రం(గోవా నార్త్, గోవా సౌత్)లో 2 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. గోవా రాష్ట్రంలో 40 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది.

గోవా లోక్‌సభ స్థానాల జాబితా

రాష్ట్రం సీటు అభ్యర్థి పేరు ఓటు పార్టీ స్థితి
Goa South Goa CAPTAIN VIRIATO FERNANDES 217836 INC Won
Goa North Goa SHRIPAD YESSO NAIK 257326 BJP Won

లోక్‌సభ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక నగరంగా పేరొందిన గోవా రాష్ట్రానికి తనదైన ప్రత్యేకత ఉంది. గోవా విస్తీర్ణం పరంగా దేశంలోని అతి చిన్న రాష్ట్రం. జనాభా పరంగా నాల్గవ చిన్నది. గోవా దాని అందమైన బీచ్‌లు, అద్భుతమైన ఆర్కిటెక్చర్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. గోవా ఒకప్పుడు పోర్చుగల్ కాలనీ. పోర్చుగీసు వారు సుమారు 450 సంవత్సరాలు ఇక్కడ పాలించారు. సుదీర్ఘ పోరాటం తర్వాత గోవాకు స్వాతంత్ర్యం వచ్చింది. పోర్చుగీస్ వారు ఈ ప్రాంతాన్ని 19 డిసెంబర్ 1961న భారత పరిపాలనకు అప్పగించారు.

చాలా కాలం పాటు పోర్చుగీస్ పాలనలో ఉన్నందున అరేబియా సముద్రంలో విస్తరించిన గోవాపై  యూరోపియన్ సంస్కృతి బలమైన ప్రభావాన్ని కలిగి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, గోవా మొత్తం జనాభాలో 66% కంటే ఎక్కువ మంది హిందువులు కాగా, 25% మంది క్రైస్తవులు. దాదాపు 8 శాతం ముస్లిం మతస్థులు నివసిస్తున్నారు. గోవాలో 2 లోక్‌సభ స్థానాలు కూడా ఉన్నాయి. వీటిలో గోవా నార్త్, గోవా సౌత్ స్థానాలు ఉన్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 2 స్థానాలకు గానూ బీజేపీ రెండు స్థానాలను గెలుచుకోగా, 2019 ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటును కోల్పోయింది. ఈ సీటు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లింది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా ప్రయోజనం లేకపోయింది.

ప్రశ్న - 2019 ఎన్నికల్లో గోవాలో ఎంత శాతం ఓటింగ్ జరిగింది?

సమాధానం - 75.14% 

ప్రశ్న - 2019 ఎన్నికల్లో గోవాలో ఏ పార్టీకి అత్యధిక ఓట్లు వచ్చాయి?

జవాబు – బీజేపీకి అత్యధికంగా 51.19% ఓట్లు వచ్చాయి.

ప్రశ్న - గోవాలో ఎన్ని లోక్‌సభ స్థానాలు ఉన్నాయి?

సమాధానం - గోవాలో 2 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి.

ప్రశ్న - 2019 ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చాయి?

సమాధానం: 2 సీట్లకు 1 గెలిచింది.

ప్రశ్న - 2019 ఎన్నికల్లో గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయి?

సమాధానం - 3 శాతం

ప్రశ్న - 2014 పార్లమెంటు ఎన్నికల్లో గోవాలో కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లు వచ్చాయి?

సమాధానం - 0 

ప్రశ్న - గోవా నార్త్ ఎంపీ ఎవరు?

సమాధానం – బీజేపీకి చెందిన శ్రీపాద్ నాయక్

ప్రశ్న - 2019లో గోవా సౌత్ పార్లమెంట్ స్థానం నుంచి ఎవరు గెలిచారు?

సమాధానం: కాంగ్రెస్‌కు చెందిన ఫ్రాన్సిస్కో సర్దిన్హా విజయం సాధించారు.

ప్రశ్న - గోవా అసెంబ్లీలో ఎన్ని సీట్లు ఉన్నాయి?

సమాధానం - 40 సీట్లు

ప్రశ్న - గోవా సీఎంగా ప్రమోద్ సావంత్ ఇప్పటివరకు ఎన్నిసార్లు ప్రమాణం చేశారు?

సమాధానం - 2 సార్లు

ఎన్నికల వీడియో