Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డామన్ & డయ్యూ లోక్‌ సభ నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలు - Daman & Diu Lok Sabha Election Constituencies wise Result

అరేబియా సముద్ర తీరంలోని డామన్ అండ్ డయ్యూ గతంలో భారత దేశంలో ఓ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం దీనిని 2020లో దాద్రా అండ్ నగర్ హవేలీలో విలీనం చేసింది. కొత్త ఆర్డర్ తర్వాత, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా మారుతాయి. పశ్చిమ భారతదేశంలోని డామన్ అండ్ డయ్యూ ప్రాంతం 1987లో లోక్‌సభ స్థానంగా ఉనికిలోకి వచ్చింది. డయ్యూ ప్రాంతం 40.00 చ. కిమీ అయితే డామన్ 72.00 చ.కి.లో విస్తరించి ఉంది. డామన్ మొత్తం జనాభా 1,91,173 కాగా డయ్యూ మొత్తం జనాభా 52,074. 1961 డిసెంబరు 19న గోవా, డామన్, డయ్యూలను భారత ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుంది. కాని పోర్చుగీసు ప్రభుత్వం 1974 వరకు వీటిపై భారత ప్రభుత్వ అధిపత్యాన్ని అంగీకరించలేదు.

డామన్ & డయ్యూ లోక్‌సభ స్థానాల జాబితా

రాష్ట్రం సీటు అభ్యర్థి పేరు ఓటు పార్టీ స్థితి
Daman and Diu Daman and Diu PATEL UMESHBHAI BABUBHAI 42523 IND Won

డామన్ అండ్ డయ్యూ కొన్ని సంవత్సరాల క్రితం వరకు కేంద్రపాలిత ప్రాంతంగా ఉండేది. ఇవి దేశంలోని పశ్చిమ తీరంలో ఉన్న రెండు వేర్వేరు జిల్లాలు. డామన్ గుజరాత్ దక్షిణ తీరంలో బొంబాయికి ఉత్తరాన 100 మైళ్ళు (160 కిమీ) దూరంలో ఉంది. అదేవిధంగా, డయ్యూ గుజరాత్‌లోని కతియావార్ ద్వీపకల్పం దక్షిణ తీరంలో ఉన్న ఒక ద్వీపం. ఇది వెరావల్‌కు ఆగ్నేయంగా 40 మైళ్ళు (64 కిమీ) దూరంలో ఉంది. జనవరి 2020లో కేంద్ర  ప్రభుత్వం దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూని కలిపి కేంద్ర పాలిత ప్రాంతాన్ని సృష్టించింది. ఇది 43 చదరపు మైళ్లు (112 చదరపు కిమీ) విస్తరించి ఉంది. ఇది 1500ల నుండి పోర్చుగీస్ కాలనీగా ఉండేది.  కానీ 1961లో గోవా విలీనంతో ఈ ప్రాంతాలు భారతదేశంలో చేర్చబడ్డాయి.

ప్రశ్న- డామన్ అండ్ డయ్యూ లోక్‌సభ స్థానం ఏ సంవత్సరంలో ఉనికిలోకి వచ్చింది?

సమాధానం - 1987లో 

ప్రశ్న- డామన్ అండ్ డయ్యూలో ప్రధానంగా ఏ భాష మాట్లాడతారు?

సమాధానం - గుజరాతీ భాష

ప్రశ్న- 2019 ఎన్నికల్లో డామన్ అండ్ డయ్యూ లోక్‌సభ స్థానాన్ని ఏ పార్టీ గెలుచుకుంది?

సమాధానం - భారతీయ జనతా పార్టీ

ప్రశ్న- డామన్ అండ్ డయ్యూ స్థానం నుండి ఎంపీ పేరు ఏమిటి?

సమాధానం - లాలూభాయ్ పటేల్

ప్రశ్న- లాలూభాయ్ పటేల్ డామన్ అండ్ డయ్యూ స్థానం నుండి ఎన్ని సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నారు?

సమాధానం: గత 15 సంవత్సరాలగా..

ప్రశ్న- దామన్ డయ్యూ సీట్లను బీజేపీ ఎన్ని సంవత్సరాలుగా ప్రాతినిథ్యంవహిస్తోంది?

సమాధానం: 2009 నుండి. అంటే గత 15 సంవత్సరాలుగా.

ఎన్నికల వీడియో