బీహార్ లోక్‌ సభ నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలు - Bihar Lok Sabha Election Constituencies wise Result

బీహార్ రాష్ట్రం ఉత్తర భారతావనిలోని ఓ ముఖ్యమైన రాష్ట్రం. దీని రాజధాని పాట్నా. ఈ రాష్ట్ర చరిత్ర చాలా పురాతనమైనది. జనాభా పరంగా, బీహార్ దేశంలో మూడవ అతిపెద్ద రాష్ట్రం. విస్తీర్ణం పరంగా ఇది దేశంలో 12వ రాష్ట్రం. రామాయణాన్ని రచించిన మహర్షి వాల్మీకి బీహార్‌లో నివసించారని నమ్ముతారు. దీనిని పశ్చిమ చంపారన్ జిల్లాలో వాల్మీకినగర్ అని పిలుస్తారు. 2001 జనాభా లెక్కల మేరకు ఆ రాష్ట్రంలో 8.28 కోట్ల జనాభా ఉంది. 2000 నవంబరు 15న బీహార్ దక్షిణ ప్రాంతాన్ని విభజించి జార్ఖండ్‌ రాష్ట్రంగా ఏర్పాటుచేశారు. బీహార్ రాష్ట్రంలో 11.27 శాతం జనాభా మాత్రమే పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దేశంలో అత్యధిక యువ జనాభా కలిగిన రాష్ట్రం బీహార్ కావడం విశేషం. ఆ రాష్ట్రంలో 25 ఏళ్లకు లోపు వారు 58 శాతం ఉన్నారు.

బీహార్ తూర్పున పశ్చిమ బెంగాల్, పశ్చిమాన ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. అలాగే ఉత్తరాన నేపాల్, దక్షిణాన జార్ఖండ్‌తో సరిహద్దుగా ఉంది. పశ్చిమ నుంచి తూర్పుగా ప్రవహిస్తున్న గంగా నది ద్వారా బీహార్ రాష్ట్రం రెండు భాగాలుగా విభజించబడింది. రాజకీయంగా బీహార్ చాలా చైతన్యవంతమైన రాష్ట్రంగా పరిగణించబడుతుంది. ఇక్కడ 40 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. రాజ్యసభలో 16 సీట్లు ఉన్నాయి. బీహార్ అసెంబ్లీలో 243 నియోజకవర్గాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ యునైటెడ్, రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు ఆ రాష్ట్రంలో ఉన్నాయి. నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

బీహార్ లోక్‌సభ స్థానాల జాబితా

రాష్ట్రం సీటు అభ్యర్థి పేరు ఓటు పార్టీ స్థితి
Bihar Kishanganj MOHAMMAD JAWED 402850 INC Won
Bihar Madhubani ASHOK KUMAR YADAV 553428 BJP Won
Bihar Muzaffarpur RAJ BHUSHAN CHOUDHARY 619749 BJP Won
Bihar Gopalganj DR. ALOK KUMAR SUMAN 511866 JD(U) Won
Bihar Bhagalpur AJAY KUMAR MANDAL 536031 JD(U) Won
Bihar Jhanjharpur RAMPRIT MANDAL 533032 JD(U) Won
Bihar Supaul DILESHWAR KAMAIT 595038 JD(U) Won
Bihar Katihar TARIQ ANWAR 567092 INC Won
Bihar Purnia PAPPU YADAV 567556 IND Won
Bihar Madhepura DINESH CHANDRA YADAV 640649 JD(U) Won
Bihar Gaya JITAN RAM MANJHI 494960 HAM(S) Won
Bihar Siwan VIJAYLAKSHMI DEVI 386508 JD(U) Won
Bihar Valmiki Nagar SUNIL KUMAR 523422 JD(U) Won
Bihar Paschim Champaran DR.SANJAY JAISWAL 580421 BJP Won
Bihar Araria PRADEEP KUMAR SINGH 600146 BJP Won
Bihar Darbhanga GOPAL JEE THAKUR 566630 BJP Won
Bihar Ujiarpur NITYANAND RAI 515965 BJP Won
Bihar Begusarai GIRIRAJ SINGH 649331 BJP Won
Bihar Sasaram MANOJ KUMAR 513004 INC Won
Bihar Buxar SUDHAKAR SINGH 438345 RJD Won
Bihar Sitamarhi DEVESH CHANDRA THAKUR 515719 JD(U) Won
Bihar Banka GIRIDHARI YADAV 506678 JD(U) Won
Bihar Munger RAJIV RANJAN SINGH ALIAS LALAN SINGH 550146 JD(U) Won
Bihar Arrah SUDAMA PRASAD 529382 CPI(ML)(L) Won
Bihar Nawada VIVEK THAKUR 410608 BJP Won
Bihar Nalanda KAUSHALENDRA KUMAR 559422 JD(U) Won
Bihar Karakat RAJA RAM SINGH 380581 CPI(ML)(L) Won
Bihar Sheohar LOVELY ANAND 476612 JD(U) Won
Bihar Pataliputra MISA BHARTI 613283 RJD Won
Bihar Patna Sahib RAVI SHANKAR PRASAD 588270 BJP Won
Bihar Jahanabad SURENDRA PRASAD YADAV 443035 RJD Won
Bihar Aurangabad ABHAY KUMAR SINHA 465567 RJD Won
Bihar Maharajganj JANARDAN SINGH (SIGRIWAL) 529533 BJP Won
Bihar Saran RAJIV PRATAP RUDY 471752 BJP Won
Bihar Samastipur SHAMBHAVI 579786 LJPRV Won
Bihar Khagaria RAJESH VERMA 538657 LJPRV Won
Bihar Hajipur CHIRAG PASWAN 615718 LJPRV Won
Bihar Vaishali VEENA DEVI 567043 LJPRV Won
Bihar Purvi Champaran RADHA MOHAN SINGH 542193 BJP Won
Bihar Jamui ARUN BHARTI 509046 LJPRV Won

బీహార్‌లో మరోసారి ఎన్నికల వాతావరణం వేడెక్కింది. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే, మహాకూటమి మధ్య తీవ్ర పోటీ నెలకొంటోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి మహాకూటమిని వీడి తన పాత కూటమి ఎన్డీయేలో చేరారు. మహాకూటమి నుంచి వైదొలిగిన తర్వాత నితీష్ మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది.

భారతదేశ ఈశాన్య భాగం మధ్యలో ఉన్న ఈ చారిత్రక రాష్ట్రానికి పాట్నా రాజధాని. బీహార్ జనాభా పరంగా దేశంలో మూడవ అతిపెద్ద రాష్ట్రం కాగా, విస్తీర్ణం పరంగా 12వ స్థానంలో ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇక్కడ ప్రధాన పోటీ ఎన్డీయే, మహాకూటమి మధ్యే జరిగింది. ఆ సమయంలో నితీష్ కుమార్ పార్టీ జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) ఎన్డీయేలో ఉంది. ఈ కూటమి మొత్తం 40 స్థానాల్లో ఎన్నికల్లో పోటీ చేసింది. మహాకూటమి 39 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. కాగా, సీపీఎంకు మద్దతుగా రాష్ట్రీయ జనతాదళ్ ఒక సీటు (అరా పార్లమెంటరీ స్థానం)ను వదిలిపెట్టింది. ఆ సమయంలో మహాకూటమి ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి రావడంతో 40 సీట్లలో 39 ఎన్డీయే ఖాతాలోకి వెళ్లాయి. మహాకూటమికి ఒక్క సీటు వచ్చింది.

ప్రశ్న - బీహార్‌లో 40 సీట్లకు గాను 39 సీట్లను ఎన్డీయే కూటమి గెలుచుకుంది. అందులో బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చాయి?

సమాధానం - 17 సీట్లు

ప్రశ్న - 2019 ఎన్నికల్లో నితీష్ కుమార్ పార్టీ జనతాదళ్ యునైటెడ్‌కు ఎన్ని సీట్లు వచ్చాయి?

సమాధానం - 16 

ప్రశ్న - 2019లో లాలూ ప్రసాద్ యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) ఎన్ని సీట్లు గెలుచుకుంది?

సమాధానం - 0

ప్రశ్న - 2019లో బీహార్‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంది?

సమాధానం - 1 

ప్రశ్న - బీహార్‌లో గత లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏకు ఎంత శాతం ఓట్లు వచ్చాయి?

సమాధానం - 53.25% 

ప్రశ్న - పాట్నా సాహిబ్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రవిశంకర్ ప్రసాద్ ఎవరిని ఓడించారు?

సమాధానం - కాంగ్రెస్ అభ్యర్థి శతృఘ్న సిన్హా

ప్రశ్న - మాజీ సీఎం జితన్‌రామ్‌ మాంఝీ ఏ స్థానం నుంచి ఓడిపోయారు?

జవాబు: ఔరంగాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి సుశీల్ కుమార్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు.

ప్రశ్న - బీహార్‌లోని 40 పార్లమెంటరీ సీట్లలో, షెడ్యూల్డ్ కులాలకు ఎన్ని సీట్లు రిజర్వు చేయబడ్డాయి?

సమాధానం - 5