అరుణాచల్ ప్రదేశ్ లోక్‌ సభ నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలు - Arunachal Pradesh Lok Sabha Election Constituencies wise Result

అరుణాచల్ ప్రదేశ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో 24వ రాష్ట్రం. ఈ రాష్ట్రం చైనాకు సమీపంలో ఉన్నందున వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉంది. అరుణాచల్ పశ్చిమాన భూటాన్, తూర్పున మయన్మార్, ఉత్తరంలో టిబెట్(చైనా), ఈశాన్యంలో అస్సాం రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. విస్తీర్ణం పరంగా అరుణాచల్ ప్రదేశ్ ఈశాన్య రాష్ట్రాల్లో అతిపెద్ద రాష్ట్రం. 1947 తర్వాత, అరుణాచల్ ప్రదేశ్ ఈశాన్య సరిహద్దు ఏజెన్సీ (NEFA)లో భాగమైంది. చైనీస్ ఆక్రమణ దాడి తర్వాత ఈ ప్రాంత విధాన ప్రాముఖ్యత పెరిగింది. 1962లో ఆరవ దలైలామా అరుణాచల్ ప్రదేశ్‌లో జన్మించారు. 2011 జనగణన మేరకు అరుణాచల్ ప్రదేశ్‌లో 13,83,727 మంది జనాభా ఉన్నారు.

సూర్యోదయ భూమిగా పేరొందిన అరుణాచల్ ప్రదేశ్ జనాభాలో దాదాపు 35 శాతం మంది వ్యవసాయం చేస్తున్నారు. ఈటా నగర్ ఆ రాష్ట్ర రాజధానిగా ఉంది. ఇక్కడ లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో 2 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి.

అరుణాచల్ ప్రదేశ్ లోక్‌సభ స్థానాల జాబితా

రాష్ట్రం సీటు అభ్యర్థి పేరు ఓటు పార్టీ స్థితి
Arunachal Pradesh Arunachal East TAPIR GAO 145581 BJP Won
Arunachal Pradesh Arunachal West KIREN RIJIJU 205417 BJP Won

అరుణాచల్ ప్రదేశ్ దేశం ఈశాన్య భారత దేశంలోని ఓ కీలక రాష్ట్రం. దీని చుట్టూ పశ్చిమాన భూటాన్, తూర్పున మయన్మార్, ఉత్తరం, ఈశాన్యంలో చైనా, దక్షిణాన అస్సాం ఉన్నాయి. ఈశాన్య ప్రాంతంలో చైనాకు ఆనుకుని ఉన్న అరుణాచల్ ప్రదేశ్ వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన రాష్ట్రం. అరుణాచలం అంటే 'ఉదయించే సూర్యుని పర్వతం' అని అర్థం. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్. ఇక్కడి ప్రజలు హిందీ భాష కూడా ఎక్కువగానే మాట్లాడుతారు. విస్తీర్ణంలో అరుణాచల్ ప్రదేశ్ ఈశాన్య భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం.

ఈశాన్య భారతదేశంలోని ఈ రాష్ట్రంలో 26 ప్రధాన తెగలు, అనేక ఉప తెగలు నివసిస్తున్నాయి. పురాణాల ప్రకారం వ్యాస మహర్షి ఇక్కడ ధ్యానం చేశారని నమ్ముతారు. ఇక్కడ ఉత్తర కొండలపై ఉన్న రెండు గ్రామాల సమీపంలో లభించిన అవశేషాలు శ్రీకృష్ణుడి సతీమణి రుక్మణి రాజభవనం అని చెబుతారు. ఆరవ దలైలామా కూడా అరుణాచల్ ప్రదేశ్ గడ్డపై జన్మించారు.

అరుణాచల్ ప్రదేశ్‌లో 2 పార్లమెంట్ స్థానాలు ఉండగా ఇక్కడ కూడా ఎన్నికల వాతావరణం వేడెక్కింది. భారతీయ జనతా పార్టీ ఈ రెండు స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇక్కడ కోల్పోయిన రాజకీయ పట్టును తిరిగి పొందాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. ఇక్కడ లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి.

ప్రశ్న - అరుణాచల్ ప్రదేశ్‌లో ఏ పార్టీ అధికారంలో ఉంది?

జవాబు: అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది.

ప్రశ్న - అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేరు ఏమిటి?

సమాధానం - పెమా ఖండూ.

ప్రశ్న - అరుణాచల్ ప్రదేశ్‌లోని 2 లోక్‌సభ స్థానాల పేర్లు ఏమిటి?

సమాధానం - అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ సీటు, అరుణాచల్ ప్రదేశ్ తూర్పు సీటు.

ప్రశ్న - అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ లోక్ సభ స్థానం నుండి 2019 ఎన్నికల్లో ఎవరు గెలిచారు?

జవాబు: బీజేపీకి చెందిన కిరణ్ రిజిజు గెలిచారు.

ప్రశ్న - కిరణ్ రిజిజు ఎంత ఓట్ల తేడాతో గెలిచారు?

సమాధానం – కిరణ్ రిజిజు 1,74,843 ఓట్ల తేడాతో గెలుపొందారు.

ప్రశ్న - 2014 ఎన్నికల్లో అరుణాచల్ ప్రదేశ్ ఫలితాలు ఏమిటి?

జవాబు: 2014 ఎన్నికల్లో ఒక సీటు ఎన్డీయేకి, ఒక సీటు యూపీఏకి దక్కింది.

ప్రశ్న - అరుణాచల్ ప్రదేశ్ ఏ సంవత్సరంలో దేశంలో రాష్ట్రంగా అవతరించింది?

జవాబు - అరుణాచల్ ప్రదేశ్ 1987 ఫిబ్రవరి 20న దేశంలో 24వ రాష్ట్రంగా అవతరించింది.

ప్రశ్న - అరుణాచల్ ప్రదేశ్‌లో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి?

సమాధానం - 60