అండమాన్ & నికోబార్ లోక్ సభ నియోజకవర్గాలు (Andaman & Nicobar Lok Sabha Constituencies)
అండమాన్, నికోబార్ దీవులు భారత దేశంలోని కేంద్ర పాలిత ప్రాంతం. మొత్తం 836 దీవుల సమూహంతో ఇది ఏర్పడింది. వీటిలో 37 దీవులు జనావాస దీవులుగా ఉన్నాయి. దీనికి పోర్ట్ బ్లేయర్ రాజధాని నగరంగా ఉంది. చెన్నై తీరానికి 1,190 కి.మీ, కొల్‌కత్తాకు 1,255 కి.మీ దూరంలో అండమాన్, నికోబార్ దీవులు ఉన్నాయి. బంగాళాఖాతం, అండమాన్ సముద్రం కలిసే ప్రాంతంలో ఈ దీవులు ఉన్నాయి. ద్వీపాల మొత్తం భూభాగం సుమారు 8,249 చ.కి.మీ ఉంటుంది. ఇందులో 2011 జనగణన మేరకు మొత్తం 3,80,581 మంది జనాభా ఉన్నారు.
1956 నవంబరు 1న అండమాన్, నికోబార్ దీవులు కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడింది. ఇందులో మొత్తం 3 జిల్లాలు ఉన్నాయి. అండమాన్, నికోబార్ దీవుల్లో ఒక లోక్‌సభ నియోజకవర్గం ఉంది.
అండమాన్ & నికోబార్ లోక్‌సభ స్థానాల జాబితా
రాష్ట్రం | సీటు | అభ్యర్థి పేరు | ఓటు | పార్టీ | స్థితి |
---|---|---|---|---|---|
Andaman and Nicobar | Andaman and Nicobar Islands | BISHNU PADA RAY | 102436 | BJP | Won |
అండమాన్ అండ్ నికోబార్ దీవులు దేశంలోని ఒక ముఖ్యమైన కేంద్రపాలిత ప్రాంతం. ఈ ప్రాంతం బంగాళాఖాతంకి దక్షిణాన హిందూ మహాసముద్రంలో ఉంది. ఈ ద్వీప సమూహంలో దాదాపు 572 చిన్న, పెద్ద ద్వీపాలు ఉన్నాయి. అయితే ఈ ద్వీపాలలో కొన్నింటిలో మాత్రమే ప్రజలు నివసిస్తున్నారు. ఈ కేంద్రపాలిత ప్రాంతం రాజధాని పోర్ట్ బ్లెయిర్. భౌగోళికంగా ఈ ప్రాంతం ఆగ్నేయాసియాలో ఉంది. ఇది ఇండోనేషియాలోని అచేకు ఉత్తరాన 150 కి.మీ దూరంలో ఉంది. దీనిని అండమాన్ సముద్రం థాయిలాండ్, మయన్మార్ నుండి వేరు చేస్తుంది.
అండమాన్ అండ్ నికోబార్ దీవుల చరిత్ర రామాయణ కాలం నాటిదని నమ్ముతారు. రామాయణ కాలంలో ఈ ప్రాంతాన్ని హందుకామన్ అని పిలిచేవారు. అయితే తర్వాత దాని పేరు మారుతూ వచ్చింది. మొదటి శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని అగాడెమోన్ అని పిలిచేవారు.
ప్రశ్న- అండమాన్ అండ్ నికోబార్ దీవులలో ఎన్ని లోక్‌సభ స్థానాలు ఉన్నాయి?
సమాధానం - 1 లోక్‌సభ స్థానం మాత్రమే
ప్రశ్న- 2019 లోక్‌సభ ఎన్నికల్లో అండమాన్ నికోబార్ దీవులను ఏ పార్టీ గెలుచుకుంది?
సమాధానం - కాంగ్రెస్
ప్రశ్న- 2019 లోక్‌సభ ఎన్నికల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో ఎంత శాతం ఓటింగ్ జరిగింది?
సమాధానం - 65.12%
ప్రశ్న- అండమాన్ నికోబార్ దీవుల లోక్‌సభ స్థానం నుండి ఎంపీ పేరు ఏమిటి?
సమాధానం - కుల్దీప్ రాయ్ శర్మ
ప్రశ్న- 2019లో ఈ లోక్‌సభ స్థానంలో బీజేపీని కాంగ్రెస్ ఎన్ని ఓట్ల తేడాతో ఓడించింది?
జవాబు: బీజేపీ అభ్యర్థి విశాల్ జాలీ 1,407 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఎన్నికల వార్తలు 2024








