ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గత వారం పార్వతీపురం మన్యం జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారి హల్ చల్ చేయడం దుమారం చెలరేగింది. నకిలీ ఐపీఎస్ అవతారమెత్తిన ఆ వ్యక్తిని విజయనగరం జిల్లా గరివిడికి చెందిన మాజీ సైనికుడు సూర్యప్రకాష్గా గుర్తించి ఆ వ్యక్తిని అరెస్టు చేశారు.