తమకు తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందంటూ ఓ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. రాజమండ్రి రాజేందర్ నగర్‌కి చెందిన ప్రేమజంట.. ప్రేమ పెళ్లి చేసుకున్న తమకు రక్షణ కల్పించాలని రాజమండ్రి ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. తామిద్దరూ గతకొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నామని.. ఇది తెలుసుకున్న తమ తల్లిదండ్రులు మూడు సంవత్సరాలుగా హరిప్రసాద్‌పై కేసులు పెట్టి వేదిస్తున్నారని ప్రియురాలు వాపోయింది.