పరమ శివుడి కంఠాభరణమైన నాగుపాము తెలంగాణలోని ఓ శివాలయ గర్భగుడిలో దర్శనమిచ్చింది. మార్గశిర గురువారం రోజున ఇలా జరగడంతో దీనిని శివలీలగా భక్తులు భావించారు. దీంతో భక్తులు తండోపతండాలుగా వచ్చి ఆ నాగుపాముకు ప్రత్యేక పూజలు చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని శ్రీ పార్వతి అమరలింగేశ్వర స్వామి ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం కావడం విశేషం.