గుజరాత్‌కు చెందిన ఆ కుటుంబానికి ఆ కారంటే ఎంతో ఇష్టం. ఆ కారుతోనే తమకు అదృష్టం పట్టిందని వారు బావిస్తారు. అందుకే దాని టైమ్ ముగిసినా.. ఘనమైన వీడ్కోలు పలికారు. దానికి పూర్తి ఆచారాలతో ఖననం చేశారు. ఓ మనిషిని ఎలా అంత్యక్రియలు నిర్వహిస్తారో ఆ స్థాయిలో ఖననం కార్యక్రమాన్ని నిర్వహించారు. దీని కోసం ఏకంగా రూ.4 లక్షలు ఖర్చు చేశారు.