యూట్యూబ్ చేసి నకిలీ నోట్లు ప్రింట్ చేసి చలామణి చేస్తున్న ఘరానా ముఠా అరెస్టయ్యింది. తిరుపతి జిల్లాలో ఇంట్లోనే గుట్టు చప్పుడు కాకుండా ఈ నకిలీ నోట్ల ప్రింటింగ్ వ్యవహారం నడిపిస్తున్నారు. పుత్తూరులో దొంగనోట్లు చలామణి చేస్తుండగా దొరికిపోయారు. తిరుపతి, చిత్తూరు, పుత్తూరు, శ్రీకాళహస్తి, నెల్లూరు, వెంకటగిరిలో ఈ నోట్లను మార్చినట్లు పోలీసులు గుర్తించారు. వీరు ఏకంగా రూ.10 లక్షల వరకు దొంగనోట్లు మార్చి తమ అప్పులు తీర్చుకున్నట్లు తెలిసింది.