తిరుమలలో పనిచేసే ప్రతి ఒక్కరూ హిందువై ఉండాలని టీటీడీ బోర్డు నూతన ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టంచేశారు. గతంలో ఉన్న టైమ్ స్లాట్ టోకెన్ పద్ధతిని మళ్లీ తీసుకొస్తామని చెప్పారు. తిరుమల ఆలయ పవిత్రకు భంగం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనిపై ఇప్పటికే దృష్టిసారించినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల నిర్వహణ దారుణమని మండిపడ్డారు.