ఇద్దరి దేశాలు వేర్వేరు. అయితే ప్రేమ వారిద్దరినీ కలిపింది. కెనడాకు చెందిన యువతిని అమలాపురంకు చెందిన అబ్బాయి వివాహం చేసుకున్నాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం అమలాపురంలో ఈ వివాహ వేడుక జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన బంధుగణం ఈ వివాహ వేడుకలో పాల్గని నవవధూవరులను ఆశీర్వదించింది.