కూటమి ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదన్నారు ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజని. తమకు అండగా పార్టీ అధినాయకుడు జగన్ ఉన్నారని అన్నారు. ఆయనే మాకు భరోసా అన్నారు. బెదిరిస్తే బెదిరిపోతామని కూటమి నేతలు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అయితే తాము అలాంటి బెదిరింపులకు ఎట్టిపరిస్థితిలోనూ భయపడబోమని వ్యాఖ్యానించారు.