కిన్లే వాటర్ బాటిల్ లో నలకలు, వెంట్రుకలు, పురుగులు కనపడ్డాయి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని ఫ్యామిలీ గ్రాండ్ దాబాలో వెంకటేశ్వర్లు అనే వినియోగదారుడు వాటర్ బాటిల్ కొనుక్కున్నాడు. బాటిల్లో నలకలు కనిపించడంతో హోటల్ యజమానిని ప్రశ్నించాడు. అతను సరిగా సమాధానం చెప్పకపోవడంపై ఆగ్రహించాడు. సీల్ వేసిన వాటర్ బాటిళ్లలో చెత్తాచెదారంపై ఫుడ్సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరాడు.