గత ఏడు నెలలుగా అద్దె చెల్లించడం లేదని నాంపల్లిలోని హైదరాబాద్ జిల్లా సబ్ రిజిస్ట్రార్, రెడ్ హిల్స్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లకు భవన యజమాని తాళం వేసి, కరెంట్ కట్ చేశాడు. దీంతో అక్కడ రిజిస్ట్రేషన్లు సహా ఇతర కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇంతియాజ్ ఖురేషి అనే వ్యక్తికి చెందిన బిల్డింగ్‌లో గత 20 ఏళ్లుగా ఇవి పనిచేస్తున్నాయి.