ఏపీ మండలి వేదికగా వైసీపీపై ఏపీ హోం మంత్రి అనిత తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో మహిళలపై అత్యాచారాలు జరిగితే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. దిశ చట్టం సమర్థవంతమైనది అయితే ఆడవారిపై అఘాయిత్యాలు ఎందుకు కొనసాగుతున్నాయని ప్రశ్నించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని అరెస్టు చేస్తున్నామని చెప్పారు.