సంధ్య థియేటర్ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టం ఎవరికీ చుట్టం కాదన్నారు. అల్లు అర్జున్ స్థానంలో రేవంత్ ఉన్నా అలానే అరెస్ట్ చేస్తారంటూ జనసేన ఆఫీస్‌లో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారు. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చారన్నారు. అభిమాని మృతిచెందిన తర్వాత వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించాలన్నారు.