చట్ట విరుద్ధంగా ప్రవర్తించే పోలీసు అధికారులపై వైసీపీ అధికారంలోకి వచ్చాక తప్పనిసరిగా చర్యలుంటాయని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వార్నింగ్ ఇచ్చారు. వారు సప్త సముద్రాలు కాదు.. పది సముద్రాలు దాటి ఉన్నా వదిలేది లేదన్నారు. వారిని తీసుకొచ్చి చట్టబద్ధంగా శిక్షించేలా చూస్తామన్నారు. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ కూడా గుర్తించాలన్నారు.