ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. గత కొంత కాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన హైదరాబాదులోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి తన మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకొని, హుటా హుటిన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయల్దేరారు.