తమిళనాడులోని తెలుగు వారిపై నోరుపారేసుకున్న సినీ నటి కస్తూరి జైలుపాలయ్యింది. గత కొంతకాలంగా పరారీలో ఉన్న ఆమెను శనివారం సాయంత్రం చెన్నై పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేసి చెన్నై తరలించారు. అక్కడి కోర్టులో హాజరుపరచగా.. ఆమెను కోర్టు 14 రోజుల రిమాండ్కు తరలించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆమెను పుళల్ సెంట్రల్ జైలుకు తరలించారు.