వాటర్ ట్యాంక్ భవనంపై నుంచి కిందపడటంతో ఓ మహిళ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్న వ్యాఖ్యలు చేశారు. యమధర్మరాజు లంచ్ బ్రేక్‌లో ఉన్నప్పుడు ఇలా జరుగుతుందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందన విషయంలో మాత్రం స్పష్టమైన సమాచారం లేదు.