కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో వింత ఫ్లెక్లీలు వెలిశాయి. భద్రాచలంలో ఎక్కడ చూసినా చెత్తకుప్పలు పేరుకుపోయాయి. స్థానికులు బహిరంగ ప్రదేశాల్లోనే చెత్తకుప్పలు పడేస్తున్నారు. దీనిపై స్థానిక మున్సిపల్ అధికారులు ఎంత ప్రచారం చేసినా ప్రయోజనం దక్కడం లేదు. దీంతో ఇక్కడ చెత్తవేసిన వాడు గాడిద అంటూ వినూత్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల ఏర్పాటు కొంత మేర ఆశించిన ప్రయోజనాన్ని చేకూరుస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.