బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లా రెడ్డి మనవరాలి వివాహ వేడుకలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. నవ దంపతులను ఆశీర్వదించారు. మల్లారెడ్డి ఇంటి వివాహ వేడుకలో రేవంత్ రెడ్డి పాల్గొనడం రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో మల్లారెడ్డి, రేవంత్ రెడ్డిల మధ్య మాటల తూటాలు పేలడం తెలిసిందే. ఆ తర్వాత మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం కూడా జరిగింది.