ప్రముఖ పారిశ్రామిక వేత్త, వ్యాపార దిగ్గజం రతన్ టాటా బుధవారం (అక్టోబర్ 09) అర్థరాత్రి కన్నుమూశారు. టాటా గ్రూప్ అండ్ టాటా సన్స్‌కు గౌరవ్ ఛైర్మన్ గా ఉన్న ఆయన భారతదేశ పారిశ్రామిక పురోగతికి ఎంతో కృషిచేశారు. అలాగే పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు. భారతదేశంలోనే అత్యుత్తమ వ్యాపారవేత్తగా పేరు పొందిన రతన్ టాటా మరణం అందరినీ కలచి వేస్తోంది.