బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, యాక్టింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు.. అలియా ఫస్ట్ మూవీ సూపర్ హిట్ కావడంతో హిందీలో ఈ అమ్మడుకు ఆఫర్స్ క్యూ కట్టాయి.