పుష్ప సినిమా రిలీజ్ తర్వాత.. పాన్ ఇండియా రేంజ్లో హాట్ టాపిక్ అయ్యారు మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్. కానీ ఇప్పుడు పుష్ప2 రిలీజ్‌కు ముందే.. ఈ సినిమా కోసం తాను తీసుకున్న రెమ్యునరేషన్ కారణంగా.. హాట్ టాపిక్ అవుతున్నారు. ఎస్ ! పుష్ప పార్ట్ 1 కోసం జస్ట్ 3 కోట్లు మాత్రమే రెమ్యునరేషన్‌గా తీసుకున్న ఫహాద్.. పుష్ప2 కోసం మాత్రం ఏకంగా 7.2 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నారట. పుష్ప2 కోసం ఫహాద్ కాల్షీట్లు ఎక్కువ కేటాయించాల్సి రావడంతో.. ఆ మొత్తాన్ని కోట్ చేశారట ఈ స్టార్ హీరో.