పుంగనూరుటో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి ఘటనపై ఏపీ ప్రభుత్వం వేగంగా స్పందించిందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ముగ్గురు మంత్రులు స్థానికంగా పర్యటించి నిందితులు అరెస్టయ్యేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. అందుకే తమ పార్టీ అధినేత జగన్ పుంగునూరు పర్యటనను రద్దు చేసుకున్నారని చెప్పారు. జగన్ పర్యటిస్తారని తెలిసే ప్రభుత్వం పుంగనూరు ఘటనపై వేగంగా స్పందించిందని చెప్పారు.