శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అబ్బాయికి భీమవరం అమ్మాయికి పెళ్లి జరిగింది. కానీ పెళైన వారం రోజులకే నవవధువు పారిపోయింది. నటుడు శ్రీకాంత్ నటించిన వినోదం చిత్రం తరహాలో ఉత్తుత్తి పెళ్లి చేసి హిందూపురం కుర్రోడిని బురిడీ కొట్టించారు భీమవరం బ్రోకర్లు. తనకు జరిగిన అన్యాయంపై బాధితుడు హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.