దర్శకుడు రాంగోపాల్ వర్మ(ఆర్జీవీ) అరెస్టుకు రంగం సిద్ధం చేసుకున్నారు. పోలీసులు రెండోసారి ఇచ్చిన నోటీసుల మేరకు ఆర్జీవీ సోమవారం కూడా ఒంగోలు పోలీసుల ఎదుట విచారణకు హాజరుకాలేదు. దీంతో హైదరాబాద్ లోని ఆయన ఇంటి వద్దకు ఒంగోలు పోలీసులు చేరుకున్నారు. అయితే ఆర్టీవీ ఇంట్లో లేరని తెలిసింది. రెండు నోటీసులకు సమాధానం ఇచ్చినా పోలీసులు ఇంటి వద్దకు రావడం సరికాదని ఆర్జీవీ తరఫు న్యాయవాది అన్నారు. ఆర్జీవీ ఎక్కడున్నారో తనకు తెలీదన్నారు.