తన తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్పై ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎంపీ గారు ఎక్కడ నిల్చున్నా కనిపిస్తారంటూ మీడియా సమావేశం సందర్భంగా నవ్వుతూ వ్యాఖ్యానించారు. పరువు నష్టం దావా కేసుకు సంబంధించి విశాఖ కోర్టులో నారా లోకేశ్ హాజర్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ భరత్పై లోకేష్ ఈ సరదా వ్యాఖ్యలు చేశారు.