సోషల్ మీడియా మిచ్చి కొందరిలో పీక్ స్టేజ్‌కి చేరుతోంది. యూట్యూబ్‌లో వ్యూస్, లైక్స్ కోసం అడ్డదారులు తొక్కి అనవసర కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. స్థానిక అటవీ ప్రాంతంలో ఉడుమును పట్టుకుని.. కూర వండి తిన్న ఇద్దరు వ్యక్తులు.. ఆ వీడియోని యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఇద్దరు వ్యక్తులు జైలు పాలయ్యారు. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగింది.