అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారి మెడలో పూల దండ వేసేందుకు వేలంపాట నిర్వహించారు. ఏకంగా లక్షకు పైగా వేలంపాటతో ఆ గొప్ప అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు హైదరాబాద్ కు చెందిన భక్తుడు ఆకుల లక్ష్మణరావు. 12 సంవత్సరాల క్రితం 5 వేల రూపాయలు పలికిన పూలదండ ఏటా పెరుగుతూ ఈసారి రూ.1.03 లక్షలకు చేరింది.