ఖమ్మం జిల్లాలో గుండెపోటుతో నాలుగేళ్ల చిన్నారి కన్నుమూసింది. ఖమ్మం గ్రామీణ మండల పరిధిలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. కర్ర వినోద్, లావణ్య దంపతుల ఏకైక కుమార్తె ప్రహర్షిక ఎప్పుడూ చలాకీగా ఉంటుంది. అయితే గ్రూప్ 3 పరీక్ష రాసి తిరిగొచ్చిన తల్లిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి కిందపడిపోయింది.