తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ దువ్వాడ శ్రీనివాస్, దివ్వల మాధిరిలపై కేసులు నమోదయ్యాయి. అయితే.. ఈ కాంట్రవర్శీ ఎపిసోడ్‌పై వారిద్దరు రియాక్ట్ అయ్యారు. తిరుమలలో తాము రీల్స్ చేశామనే ఆరోపణల్లో నిజం లేదన్నారు దువ్వాడ శ్రీనివాస్. తాము తప్పు చేసి ఉంటే వెంకటేశ్వర స్వామే తమను శిక్షిస్తారని అన్నారు. అటు తమ వాదనను కోర్టులో వినిపిస్తామని చెప్పారు.