యూపీకి చెందిన ఓ ఎమ్మెల్యేకి వింత అనుభవం ఎదురైయ్యింది. ఓ వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి.. గత ఎన్నికల్లో మీకే ఓటేశానని.. తనకు మీరే పిల్లను చూసి పెళ్లి చేయాలని మొరపెట్టుకున్నాడు. 44 ఏళ్ల వ్యక్తి ఈ రకమైన విచిత్ర కోరిక కోరడంతో ఎమ్మెల్యే ఆశ్చర్యానికి గురైయ్యాడు. బీజేపీ ఎమ్మెల్యే బ్రిజ్‌భూషణ్ రాజ్‌పుత్, ఆ వ్యక్తి మధ్య సాగిన ఈ సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.