తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారంనాడు మలయప్ప స్వామి మోహినీ అవతారంలో తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవను తిలకించేందుకు శ్రీవారి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.